Tuesday 7 June 2016

జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః

ఈ మాసం ప్రత్యేకత ఏమిటీ  ఆరాదన విశేషం ఏంటీ జ్యేష్ఠమాసంలో ‘ఇంద్ర’నామము కల సూర్యుడు తనయొక్క తొమ్మిదివేల కిరణములతో లోకమును తరింపజేయును. ఈ ఇంద్రరూప కిరణములే వర్షఋతువునందు వర్షకారకాలుగా మారుతాయి. అంతేకాక ఈ మాసమునకు తెల్లని వస్త్రములు ధరించిన రుద్రగణములు అధిపతులుగా ఉంటారు. ఈ మాసములో రుద్రాభిషేకాదులు తాపశాంతిని కలుగజేస్తాయి.
విష్ణుసహస్ర నామములలో ‘జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః’ అని దేవతలందరిలో శ్రేష్ఠుడుగా, జ్యేష్టుడుగా చెప్పబడ్డ విష్ణువును త్రైవిక్రమునిగా, వామనునిగా ఈ మాసమమంతా పూజించవలెను. అంతేకాక ఈ మాసమంతా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పూజించడం కూడా శాస్త్రములలో చెప్పబడింది.
ఈ మాసమంతా జలదానం చేయడం పుణ్యలోక ప్రాప్తిని కలుగజేయును.
ఈ మాసములో తిరుమలలో స్వామివారికి చతుర్దశి, పూర్ణిమ, పాడ్యమి తిథులయందు జ్యేష్టాభిషేకములు నిర్వహిస్తారు. జగమంతా శాంతిగా ఉండడానికే కాక సంవత్సర కాలంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటి పరిహారార్థం ఇవి నిర్వహిస్తారు. అభిషేకం అయిన తరువాత చతుర్దశినాడు స్వామివారికి వజ్రకవచమును, పూర్ణిమ నాడు ముత్యాల కవచమును, పాడ్యమి వజ్రకవచమును అలంకరింపజేసి తిరువీధులలో ఊరేగిస్తారు.
పురుషోత్తమ క్షేత్రము (పూరీ)నందు కూడా సుభద్రా సహిత జగన్నాథ, బలభద్రుల మూలవిరాట్టులకు అభిషేకము నిర్వహించి గజానన అలంకారము చేస్తారు.
మధ్వ సంప్రదాయానికి చెందినా ఆచార్యులలో మంత్రాలయమునకు చెందినా శ్రీవాదీంద్రతీర్థులు, ముళబాగిలుకు చెందినా శ్రీశ్రీపాదరాయలు, కుంభకోణమునకు చెందిన శ్రీ విజయేంద్ర తీర్థులు కూడా ఈ మాసములోనే జన్మించారు.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles