Showing posts with label ఆరోగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యం. Show all posts

Friday 2 December 2016

సూర్యరశ్మితో ఉపయోగమేంటి???

*సూర్యరశ్మితో ఉపయోగమేంటి*?
  ప్రశ్న: *మన శరీరానికి సూర్యరశ్మి ఎలా మేలు చేస్తుంది?*

జవాబు: బూజు, బాక్టీరియా లాంటి సూక్ష్మ జీవులను నశింప చేయడంతో పాటు సూర్యరశ్మి మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కూడా దోహదపడుతుంది. వీటితోపాటు సూర్యరశ్మికి మన శరీరాలను ఆరోగ్యవంతంగా ఉంచే ప్రక్రియలో ఎంతో ప్రమేయం ఉంది. రోజులో కొంతసేపైనా మన శరీరానికి సూర్యరశ్మి సోకితే, దేహంలోని కండరాలతో పాటు నాడీ మండలం కూడా ఉత్తేజితమవుతుంది. రక్తంలోని తెల్లకణాలు సూర్యరశ్మి వల్ల మరీ శక్తివంతమై అంటు వ్యాధులు సోకకుండా అడ్డుకుంటాయి. సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలు శరీరంలో డి విటమిన్‌ను ఉత్పన్నం చేసి ఎముకలు దృఢంగా బలంగా ఉండేటట్లు చేస్తాయి. పాశ్చాత్యుల్లా తెల్లగా, మచ్చలతో పాలిపోయినట్లు ఉండే శరీర వర్ణం కంటే, మన దేశ వాసుల చర్మ సౌందర్యం ఈ అతినీలలోహిత కిరణాలు సోకడంతో ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల వారు ఈ కిరణాలు ఎక్కువ మోతాదులో లభించే మన దేశ గోవా లాంటి సముద్ర తీర ప్రాంతాలకు వచ్చి అక్కడ సూర్యస్నానాలు చేస్తుంటారు. ఏది ఏమైనా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కొంతసేపు సూర్యరశ్మి తగిలేటట్లు జాగ్రత్త పడటం మన శరీర ఆరోగ్యానికి మంచిది.

ఎసిడిటీ పోవాలంటే

*ఎసిడిటీ పోవాలంటే..*

వేళకు భోంచేయకపోవడం, హోటళ్లలో మసాలాలు, జంక్‌ ఫుడ్‌ తినడం, శీతలపానీయాలు తాగడం, దీర్ఘకాలిక జబ్బులకు మందుబిళ్లలు వేసుకోవడం.. వీటివల్ల కడుపులో గ్యాస్‌ తలెత్తి నానాతిప్పలు పడుతుంటాం. ట్యాబ్లెట్స్‌ వేసుకున్నప్పటికీ అప్పటికప్పుడు తప్పిస్తే.. శాశ్వత పరిష్కారం దొరకదు. అందుకే సహజ పద్ధతులతో గ్యాస్‌ను కట్టడి చేయాలంటే..

రాత్రి భోజనం తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు.. ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీళ్లు తాగండి. మళ్లీ ఉదయాన్నే నిద్రలేస్తూనే పరగడుపున కూడా గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఉపశమనం లభిస్తుంది.

ఒక్కోసారి ఉదరంలో పుట్టుకొచ్చే ఎసిడిటీ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏమి చేసినా ఒక పట్టాన తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో బాగా మాగిన అరటిపండును తినండి. అందులోని పొటాషియం ఎసిడిటీని తగ్గిస్తుంది. కడుపులో ఇబ్బందులు తొలగుతాయి.
కాచి చల్లార్చిన గ్లాసుడు పాలలోకి ఒక స్పూను తేనె కలుపుకుని తాగండి. పాలలోకి అలవాటు ప్రకారం పంచదార లేదా బెల్లం, హార్లిక్స్‌ వంటివేవీ కలపకూడదు.

ఒక కప్పు నీటిని మరగనివ్వండి. అందులో ఒక టేబుల్‌స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలాగే ఉంచండి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఆ నీటిలోకి ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటీకి పరిష్కారం లభించినట్లే.

పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. కాసేపయ్యాక చల్లారిన తరువాత ఆ నీటిని సేవించండి. రోజూ ఇలా చేస్తే వారం పది రోజుల్లో గ్యాస్‌ కొంతవరకైనా తగ్గుతుంది.

మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ కడుపులోని గ్యాస్‌కు కల్లెం వేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తిన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం మరవొద్దు.

కడుపుబ్బరం తక్షణ సమస్యకు చక్కటి పరిష్కారం తాజా కొబ్బరి బోండం తాగడం. గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. రీఫ్రెష్‌ అవుతారు.

పూర్వం భోజనం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు పెద్దలు. ఇప్పటి తరానికి ఆ అలవాటు పోయింది కానీ.. బెల్లం వల్ల గ్యాస్‌ ఎంతగానో తగ్గుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది.

సిరిభోజనం(ఇది కార్తికమాసం. వనభోజన మాసం)

ఇది కార్తికమాసం. వనభోజన మాసం. ఇంటిల్లపాదీ వనభోజనం చేయాలి.
ఆ వనంలో ఉసిరిచెట్టు ఉండాలి. భోజనంలో ఉసిరి వంట ఉండాలి.
ఇది సంప్రదాయం. అది ఎందుకంటారా...? ఆగండాగండి...
ఉసిరి అంటే... ‘సి’ విటమిన్ రిచ్. ఆరోగ్యం వెరీ మచ్. అందుకే...
ఉసిరి ఉన్న భోజనం... సిరిభోజనం.

*ఆమ్లా షర్బత్*

కావలసినవి: ఉసిరికాయలు- 500 గ్రా, చక్కెర- 200 గ్రా, జీలకర్ర పొడి- అర టీ స్పూన్, ఉప్పు - అర టీ స్పూన్, పుదీన ఆకులు - మూడు, ఐస్- పది క్యూబ్‌లు

తయారీ:  ఉసిరికాయలను కడిగి తగినంత నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత చేత్తో చిదిమి గింజలను తీసి వేయాలి.  ఉసిరిక గుజ్జులో చక్కెర, పుదీన ఆకులు, ఒక కప్పు చన్నీరు పోసి, మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అందులో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఐస్‌క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. దీనిని నిల్వ చేసుకోవచ్చు. గది వాతావరణంలో రెండు రోజులు, ఫ్రిజ్‌లో వారం తాజాగా ఉంటుంది.

గమనిక:  ఎప్పటికప్పుడు తాజాగా కావాలంటే ఉసిరి కాయలను తరిగి, గింజలు తీసి మిక్సీలో గుజ్జు చేయాలి. పలుచటి వస్త్రంలో వేసి రసం తీయాలి. ఆ గుజ్జుకు కొంత నీటిని చేరుస్తూ, మరలా మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. తేనె కలిపి సర్వ్ చేయాలి.

*ఆమ్లా  మురబ్బా*

కావలసినవి: ఉసిరికాయలు- 100 గ్రా, చక్కెర- 100 గ్రా, నీరు- 125 మి.లీ, కుంకుమ పువ్వు- ఐదు రేకలు, ఏలకుల పొడి- పావు టీ స్పూన్
తయారీ:  ఉసిరికాయలను కడిగి, తురమాలి. గింజలు లేకుండా మొత్తం కోరుకోవాలి.  ఒక పాత్రలో చక్కెర, నీరు కలిపి కరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ కోరు వేసి, సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి.  ఈ మిశ్రమం ఉడికి దగ్గరయ్యే వరకు అడుగు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.  మిశ్రమం తీగలాగ సాగిన తర్వాత దించేసి కుంకుమ పువ్వు, ఏలకుల పొడి వేసి కలిపితే మురబ్బా రెడీ.  ఇది చల్లారిన తర్వాత తడిలేని గాజు జాడీలోకి తీసుకోవాలి. దీనిని తేమ తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.ఉసిరి మురబ్బాను అలాగే తినవచ్చు. బ్రెడ్, చపాతీల మీద పలుచగా రాసి తినవచ్చు.

*ఉసిరి పులిహోర*

కావలసినవి: బియ్యం- ఒక కప్పు, ఉసిరికాయ తురుము- ఒక కప్పు, కొత్తిమీర- రెండు రెమ్మలు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత
పోపు కోసం: ఆవాలు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, పచ్చి సెనగపప్పు- ఒక టీ స్పూన్, అల్లం తరుగు- అర టీ స్పూన్, ఎండు మిర్చి- రెండు, పచ్చి మిర్చి- రెండు (తరగాలి), కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె - ఒక టేబుల్ స్పూన్
తయారీ:  అన్నం వండి చల్లారబెట్టాలి.  బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేయాలి.  అవి వేగిన తర్వాత ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి, రెండు నిమిషాల సేపు సన్న మంట మీద మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.మిశ్రమం చల్లారాక అన్నంలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లాలి.

*ఉసిరి పప్పు*

కావలసినవి: కందిపప్పు- ఒక కప్పు, టొమాటో ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, ఉసిరికాయ ముక్కలు- అరకప్పు, మిరప్పొడి- ఒక టీ స్పూన్, పసుపు- చిటికెడు

పోపు కోసం:  నూనె- రెండు టీ స్పూన్‌లు, ఆవాలు- అర టీ స్పూన్, సెనగపప్పు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, జీలకర్ర-  అర టీ స్పూన్, వెల్లుల్లి రేకలు- మూడు, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు- ఒక టీ స్పూన్
తయారీ:  కందిపప్పును కడిగి ప్రెషర్‌కుకర్‌లో వేయాలి. అందులో టొమాటో, ఉల్లిపాయ, ఉసిరిముక్కలు, మిరప్పొడి, పసుపు, ఒకటిన్నర కప్పు నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పప్పులో ఉప్పు వేసి పప్పు గుత్తితో మెదపాలి.  ఒక పాత్రలో నూనె వేడి చేసి, ఆవాలు వేయాలి.  అవి వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులన్నింటినీ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు పోపులో మెదిపి పక్కన ఉంచిన పప్పు వేసి కలపాలి.

గమనిక: మిరప్పొడి బదులు పచ్చి మిర్చి వేసుకోవచ్చు.

*ఉసిరి ఊరగాయ*

కావలసినవి: ఉసిరికాయలు- పావు కిలో, ఆవాల పొడి - 50 గ్రా, కారం - 50 గ్రా, పసుపు - ఒక టీ స్పూన్, ఉప్పు - 50 గ్రా, వెల్లుల్లి రేకలు - పది, నూనె - రెండు టేబుల్ స్పూన్‌లు పోపుదినుసులు  ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి

తయారీ:  ఉసిరికాయలను కడిగి తుడవాలి. బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఉసిరికాయలను వేసి సన్నమంట మీద మెత్తగా మగ్గనివ్వాలి. ఈ ఊరగాయకు ఉసిరి గింజలను తీయాల్సిన అవసరం లేదు.  మెత్తగా మగ్గిన కాయలను మరొక పాత్రలోకి తీసి అదే బాణలిలో పోపు దినుసులు వేయించాలి.  అందులో ముందుగా వేయించి పక్కన ఉంచిన ఉసిరికాయలను వేసి పైన కారం, పసుపు, ఆవాల పొడి, ఉప్పు , వెల్లుల్లి రేకలు వేయాలి. పైన మిగిలిన నూనె వేసి కలిపి చల్లారని వ్వాలి.  తర్వాత తేమలేని గాజు లేదా పింగాణి జాడీలో తీసుకోవాలి. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. తేమ తగలకుండా వాడితే ఆరు నెలలు తాజాగా ఉంటుంది. ఈ ఊరగాయ చేసిన రోజు పైకి నూనె కనిపించదు. రెండు రోజులకు కాయల్లోని నూనె పైకి తేలుతుంది.

ధ్యానం ద్వారా దివ్యత్వం

ధ్యానం - అహంభావాన్ని చేదించి అతీతమానసమై అంతర్లయగా సాగేది.
ధ్యానం - దివ్యజీవనమునకు దోహదకారి.
ధ్యానం - ఆత్మాన్వేషణకై చేసే అంతర్యానం.
ధ్యానం - అంతరాన్న ఆత్మాపరమాత్మల అనుసంధానం.
ధ్యానం - ఆత్మ స్మృహ.
ధ్యానం - ఆత్మ దర్శనం.

ధ్యానంలో - అహంభావం అంతరిస్తుంది.
ధ్యానంలో - అహంకారం అడ్డుతొలగిపోతుంది.
ధ్యానంలో - ఆభిజాత్యం ఆవిరైపోతుంది.
ధ్యానంలో - అనుమానాలు అదృశ్యమౌతాయి.
ధ్యానంలో - అజ్ఞానం అంతరార్దమౌతుంది.
ధ్యానంలో - అంతర్యామియందు అపరిమితమైన అపేక్ష అంకురిస్తుంది.
ధ్యానంలో - అంతర్భూతంగా ఆధ్యాత్మికత అవతరిస్తుంది.
ధ్యానంలో - ఆరాధన అంతర్వాహినవుతుంది.
ధ్యానంలో - అభ్యాసంచే అన్నివేళలా అన్నింటా అంతటా ఆత్మభావం అలవడుతుంది.

HOW TO RELAX TENSIONS ?


Only if we accept ourselves totally is there no tension. This total acceptance is the miracle, the only miracle. To find a person who has accepted himself totally is the only surprising thing. ……

“ Tension means a gap between what you are and what you want to be. If the gap is great, the tension will be great. If the gap is small, the tension will be small. And if there is no gap at all, it means you are satisfied with what you are. In other words, you do not long to be anything other than what you are. Then your mind exists in the moment. There is nothing to be tense about; you are at ease with yourself. You are in the Tao. To me, if there is no gap you are religious; you are in the dharma.

The gap can have many layers. If the longing is physical, the tension will be physical. When you seek a particular body, a particular shape - if you long for something other than what you are on a physical level - then there is tension in your physical body. One wants to be more beautiful.

Now your body becomes tense. This tension begins at your first body, the physiological, but if it is insistent, constant, it may go deeper and spread to the other layers of your being.

If you are longing for psychic powers, then the tension begins at the psychic level and spreads.
The spreading is just like when you throw a stone in the lake. It drops at a particular point, but the vibrations created by it will go on spreading into the infinite. So tension may start from any one of your seven bodies, but the original source is always the same: the gap between a state that is and a state that is longed for.
If you have a particular type of mind and you want to change it, transform it - if you want to be more clever, more intelligent - then tension is created. Only if we accept ourselves totally is there no tension. This total acceptance is the miracle, the only miracle. To find a person who has accepted himself totally is the only surprising thing.

Existence itself is non-tense. Tension is always because of hypothetical, non-existential possibilities.
In the present there is no tension; tension is always future-oriented. It comes from the imagination.
You can imagine yourself as something other than you are. This potential that has been imagined will create tension. So the more imaginative a person is, the more tension is a possibility. Then the imagination has become destructive.

Imagination can also become constructive, creative. If your whole capacity to imagine is focused in the present, in the moment, not in the future, then you can begin to see your existence as poetry.

Your imagination is not creating a longing; it is being used in living. This living in the present is beyond tension. “
OSHO
Source book : The Psychology of the Esoteric

Thursday 7 January 2016

సంతోషకరమైన ఆరోగ్య జీవితానికి 40 చిట్కాలు


ఆరోగ్యం
1. పుష్కలంగా నీరు త్రాగండి.
2. రాజు లాగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి, ప్రిన్సు లాగా లంచ్ తీసుకోండి, బెగ్గర్ లాగా డిన్నర్ తీసుకోండి.
3. చెట్లు మరియు మొక్కల మీద పెరిగే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి
4. 3 ఈ లతో జీవించండి --- శక్తి (Energy), ఉత్సాహం (Enthusiasm) మరియు సానుభూతి (Empathy).
5. ప్రార్థన మరియు పర్యాలోచనకోసం సమయాన్ని కేటాయించండి.
6. ఎక్కువగా ఆటలు ఆడండి.
7. మీరు గత సంవత్సరం కన్నా ఎక్కువ పుస్తకాలను చదవండి.
8. ప్రతీ రోజు కనీసం 10 నిమిషాల పాటు మౌనంగా కూర్చోండి.
9. 7 గంటల పాటు నిద్రపోండి.
వ్యక్తిత్వం:
10. ప్రతి రోజు 10-30 నిమిషాల పాటు నడవండి - - మరియు చిరునవ్వుతో నడవండి.
11. మీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో సరిపోల్చకండి. వారి ప్రయాణం దేని గురించి అని ఏ అవగాహన మీకు లేదు.
12. ప్రతికూల ఆలోచనలు లేదా మీరు నియంత్రించలేని విషయాలను కలిగి ఉండొద్దు. బదులుగా అనుకూల ప్రస్తుత క్షణంలో మీ శక్తిని పెట్టుబడిగా పెట్టండి.
13. అతిగా చేయొద్దు; మీ హద్దుల్లో వుండండి.
14. మిమ్మల్ని మీరు ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి; ఇంకెవ్వరూ చేయరు.
15. పుకార్ల మీద మీ విలువైన శక్తిని వృథా చేయకండి.
16. మీరు మేల్కొ న్నప్పుడు ఎక్కువ కలలు కనండి.
17. అసూయ వలన సమయం వృధా అవుతుంది. మీకు కావలసినవన్నీ మీకు ఇప్పటికే వున్నాయి.
18. గతం యొక్క సమస్యలను మరిచిపొండి. అతని/ఆమె యొక్క గత తప్పులను మీ భాగస్వామికి గుర్తు చేయవద్దు. అది మీ ప్రస్తుత ఆనందాన్ని నాశనం చేస్తుంది.
19. ఇతరులను అసహ్యించుకుంటూ సమయం వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. ఇతరులను అసహ్యించుకోకండి.
20. అది మీ ప్రస్తుతాన్ని పాడుచేయకుండా ఉండడానికి, మీ గతాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి.
21. మీ సంతోషానికి మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ బాధ్యులు కారు.
22. జీవితం ఒక పాఠశాల మరియు మీరు నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నారు అని గ్రహించండి. సమస్యలు కనబడి దూరంగా వాడిపోవు ఆల్జీబ్రా తరగతి వంటి పాఠ్యాంశంలోని భాగంగా ఉంటాయి, కానీ మీరు నేర్చుకున్న పాఠాలు ఒక జీవితకాలం పాటు నిలిచిపోతాయి.
23. ఎక్కువగా చిరునవ్వు చిందించండి మరియు నవ్వండి.
24. ప్రతీ వాదనలో మీరే గెలవాలని లేదు. అనంగీకారాన్ని అంగీకరించండి.
కమ్యూనిటీ
25. తరచుగా మీ కుటుంబానికి కాల్ చేయండి.
26. ప్రతీ రోజు ఇతరులకు ఏదో ఒక మంచి చేయండి.
27. అందరినీ ప్రతీ దాని కొరకు క్షమించండి.
28. 70 పైన & 6 లోపు వయస్సు కలిగిన వారితో సమయము గడపండి.
29. కనీసం ముగ్గురు వ్యక్తులను ప్రతి రోజు నవ్వించడానికి ప్రయత్నించండి.
30. ఇతర వ్యక్తులు మీ గురించి ఏమనుకుంటున్నారనేది నీకు అనవసరం.
31. మీరు అనారోగ్యంగా వున్నప్పుడు మీ ఉద్యోగం మిమ్మల్నికాపాడదు. మీ కుటుంబము మరియు స్నేహితులు కాపాడుతారు. మీకు అందుబాటులో ఉంటారు.
జీవితం
32. సరైన పనులు చేయండి.
33. ఉపయోగం లేనిదాన్ని, బాగా లేనిదాన్ని లేక ఆనందంగా లేనిదాన్ని వదిలి వేయండి.
34. క్షమాగుణం అన్నింటినీ బాగుచేస్తుంది.
35. ఒక పరిస్థితి ఎంత మంచిదైనా లేక చెడుదైనా, అది మారుతుంది.
36. మీకు ఏవిధముగా అనిపించినా సరే, లేవండి, దుస్తులు వేసుకోండి మరియు బయటికి రండి.
37. అత్యుత్తమమైనది ఇంకా రావలసి ఉంది.
38. మీరు ఉదయం చురుకుగా మేల్కొన్నప్పుడు, దాన్ని అలాగే అంగీకరించవద్దు- జీవితాన్ని అక్కున చేర్చుకోండి.
39. మీ లోపల వుండేది ఎప్పుడూ సంతోషంగా వుంటుంది. కాబట్టి మీరు సంతోషంగా వుండండి.
చివరిదైన ముఖ్యమైనది:
40. జీవితాన్ని ఆస్వాదించండి!
-


Friday 18 December 2015

"విషానికి విరుగుడు పంచగవ్యాలు".

పవిత్రమైన యమునానది, అందులో కాళీయమడుగు, కాళీయమడుగులో కాలకూటవిషాన్ని చిమ్ముతున్న భయంకరమైన కాళీయసర్పము. అది ఎంత భయంకరమైన విషమంటే ఆ మడుగు సమీపానికి కూడా ఎవరూ వెళ్ళలేని పరిస్థితి, మడుగులోని నీరంతా విషతుల్యం. 

చిన్నికృష్ణుడు ఆ మడుగులోకి దూకాడు, కాళీయుని పడగలపైకి ఎక్కి నాట్యం చేశాడు., దాని మదాన్ని అణచివేసి యమునమ్మకు విముక్తిని కలిగించాడు. ప్రజలకు మేలు జరిగింది. అందరూ సంతసించారు. క్లుప్తంగా ఈ కథ అందరికీ తెలిసిందే,  కాని మడుగు సమీపంలోకి మానవులెవ్వరూ వెళ్ళలేని స్థితిలో కృష్ణుడు మడుగులో దూకినాడు కదా, విష ప్రభావం ఆయనపై ఎందుకు పడలేదు, ఆయనకు ప్రమాదం ఎందుకు జరుగలేదు అనేది సందేహం.
శ్రీకృష్ణుడు గోపాలుడు, ఎప్పుడూ గోవుల మధ్యలోనే నివసిస్తూ వాటికి ఆనందం కలిగించే గోవిందుడు. గోధూళి. గోమయంతో కూడి ఉన్న ప్రదేశంలో ఆటలాడుకునేవాడు. ఆవు పాలు. పెరుగు. వెన్నమీగడలు, నెయ్యి ఆయన ఆహారం. అంతే కాదు శ్రీకృష్ణుడు ప్రతినిత్యం గోమూత్రసేవనం చేసేవాడు. గోసేవయే ఆయన నిత్యకృత్యము. కాలకూటవిషాన్ని అయినా సరే హరించే శక్తి కలిగిన ఆవుపాలు, గోమూత్రాన్ని క్రమం తప్పక సేవించడమే కాకుండా నిరంతరం గోవుల మధ్యన వసించిన కారణాన కృష్ణుడికి భయంకరమైన విషం వలన ప్రమాదం జరుగలేదు.

తెలుసుకోండి,   "విషానికి విరుగుడు పంచగవ్యాలు".

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles