Showing posts with label క్షేత్ర మహత్యం. Show all posts
Showing posts with label క్షేత్ర మహత్యం. Show all posts

Friday 13 January 2017

మహానంది

మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కలదు. అదేమంటే..... గర్బాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం కలదు. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రుల పై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధి మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది. నంద్యాల నుండి ప్రతి అర్ద గంటకు ఒక బస్ కలదు.

గిద్దలూరు నుండి గాజులపల్లి స్టేషనులోదిగి వెళ్ళవచ్చు. గాజులపల్లికి సుమారు 6 కి.మీటర్లుంటుంది, మహానంది. ఇది కూడా పేరెన్నికగన్న శైవక్షేత్రాల్లో ఒకటి. నంధ్యాల నుండి 16 కిలోమీటర్లుంటుంది. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్.

ఇక్కడ మహానందీశ్వరాలయం - ఆలయానికెదురుగా కోనేరు. కోనేరులోకి నీరు ఒకనంది నోటిగుండా నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. చాలా తేలికై నీరు స్వచ్ఛంగా వుంటుంది. కోనేరు సుమారు 6 అడుగుల లోతుంటుంది. నీటి అడుగున ఎంత చిన్న వస్తువైనాసరే స్పష్టంగా పైకి కనబడుతుంది. కోనేటి నీటిమట్టం ఒకే విధంగా వుండటానికి కొన్ని తూములు కట్టబడినాయి. నీరంతా కాలువలద్వారా కొన్ని వందల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తూ విస్తారంగా అరటి తోటలు పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడి అరటిపండ్లు చాల ప్రసిద్ధం. తిరిగి నంద్యాల వచ్చి అక్కడినుండి శ్రీశైలమునకు రావచ్చును.

అరుణాచలేశ్వరుడు


===============
మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.

అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,

 సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.

 కంచిలో పృథివీ లింగం,

 జంబుకేశ్వరంలో జలలింగం,

 అరుణాచలంలో అగ్నిలింగం,

 చిదంబరంలో ఆకాశలింగం,

 శ్రీకాళహస్తిలో వాయులింగం,

 కోణార్కలో సూర్యలింగం,

 సీతగుండంలో చంద్రలింగం,

 ఖాట్మండులో యాజమాన లింగం –

 ఈ ఎనిమిది అష్టమూర్తులు.

 ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.

 కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.

అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.

 అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.

అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.

 అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.

ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.

 అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.

 అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.

 కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.

 అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.

 అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

 అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.

 అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.

 అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి
 జననాత్ కమలాలే
 స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది.

మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.

ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.

 అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.

దాని పేరే అరుణాచలం.

 అచలము అంటే కొండ.

 దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.

ఆకొండ అంతా శివుడే.

 అక్కడ కొండే శివుడు.

 కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.

 అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.

 అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.

గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.

 ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి  ఉంటుంది.

అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.

 అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.

 దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.

ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.

 ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.

 అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.

ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.

 అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.

 కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.

 అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.

 అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.

 అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

 అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.

ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.

ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.

 అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.

అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.

 ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.

 నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.

 ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.

అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.

అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.

తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.

 రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.

ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

 తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.

ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.

 అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.

 దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.

 అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.

అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

 పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.

 ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.

 లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.

శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

 అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.

ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.

సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.

స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.

 అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.

 అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.

అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.

Thursday 12 January 2017

భైరవకోన


ప్రతీ ఒక్కరు దర్శించవలసిన మహామహిమాన్వితమైన శక్తిక్షేత్రం..
ఇక్కడ శ్రీశ్రీశ్రీ త్రిముఖదుర్గాంబ
(మహాశక్తి) అమ్మవారు,, శ్రీ బర్గుళేశ్వరస్వామివారు,,అంతేకాక, మల్లికార్జునలింగం,,కాశీవిశ్వేశ
్వరలింగం,,నగరేశ్వరలింగం,,ఇలా ఎన్నో శివలింగాలతో విరాజిల్లే ఈ క్షేత్రాన్ని ఒకే బండరాయిలో అద్భుతంగా చెక్కడమనేది కేవలం సిద్దత్వం ఉన్న శిల్పికే సాధ్యం.. అలాంటి ఒక పెద్దాయన అహోరాత్రులు శ్రమించి నిర్మించి తన తపఃశక్తిని మొత్తం ధారపోసి అక్కడి దేవతావిగ్రహాలన్
నింటికి ప్రాణం పోసి ప్రతిష్ట గావించారు.. ఈ క్షేత్రనికి రక్షణ శ్రీ కాలభైరవుడు.. మహాఉగ్రరూపంగా ఇక్కడ ఉండే కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభమైన విషయం.కాదు.. ఈ క్షేత్రంలో ఎటువంటి తప్పులు జరిగినా వారిని సర్వనాశనం చేస్తుంది అమ్మవారు.. మైలతో,,ముట్టుతో ఉన్నవారు ఈ క్షేత్రంలోకి ప్రవేశించకూడదు.. ఇక్కడి అమ్మ దయ అపారం.. తనని నమ్మిన భక్తులకు కొంగుబంగారం.. అనుక్షణం వారిని కంటికిరెప్పలా కాపాడుతుంది.. ఎవరైనా ఎడతెగని కష్టాలలో ఉన్నవారు ఐదు పౌర్ణములు అమ్మవారిని దర్శించి,,భక్తి
శ్రద్దలతో మీ శక్తికొలది పూజించి ఆ రాత్రి అమ్మవారి సన్నిధిలో నిద్రచేసిన మీ సమస్యలు ఎటువంటివైనా త్వరలోనే సమసిపోతాయి శివా.. అమ్మను పూజించండి..ఆయురారోగ్య ఆనందాలతో వర్థిల్లండి..
రూట్,,.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి వయా పొదిలి,,కనిగిరి,,C S పురం మీదుగా భైరవకోన క్షేత్రాన్ని చేరుకోవచ్చు..
మళ్ళీ కలుద్దాం శివా.,,శివోహం..
||శివాయ పరమాత్మనే నమః||

Monday 9 January 2017

అసలు శివుని యొక్క ఆత్మలింగం ఎందుకు (గోకర్ణ లో) గణపతి చేతుల మీదుగా భుమిమీద పెట్టబడింది?


భూగోళం పై సృష్టి జరగకముందు మొత్తం భూమిని ఆవరించి ‘సముద్రుడు’ ఉండేవాడు. ఎక్కడా కుడా ఇసుమంతైనా భూభాగం కనిపించేది కాదు. దేవతలు సముద్రుడికి భూగ్రహాన్ని నివాసంగా ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో దేవలోకంలో ఉన్న బ్రహ్మ సృష్టి జరగాలనీ, అదికూడా మహాశివుని ద్వారా జరగాలనీ, అదికూడా ‘భూమి’ మీద సముద్రుడి చుట్టుకొలతలతో జరగాలనీ ఆశించాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న సముద్రుడు తను ఆవరించిన చుట్టుకొలతలో కొంతమేర తగ్గించి అక్కడక్కడ భూమి బయటకు కనిపించే విధంగా తన రూపాన్ని అమర్చుకున్నాడు. అంతట పరమశివుడు మరణము సంభవించనీ, సమానగుణములూ, సత్వగుణములు కలిగిన మానవజాతిని సృస్టించడానికి కావలసిన శక్తి కోసం పాతాళలోకంలో ఒకానొక శుభదినాన్న తపస్సు ప్రారంభిస్తాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ సృష్టి అంటే ‘చరాచర’ జగత్తు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ ఒకదానిమీద మరొకటి ఆధారపడేలా ఉండాలి కాని సృష్టి అంటే సమాన జగత్తు కాదనీ, 5 భిన్న సముదాయాల సమ్మేళనమే (పంచ భూతాలు) సృష్టి అనీ, శివుని తపస్సు అందుకు భిన్నంగా ఉందనీ “నేనొకటి తలిస్తే శివుడొకటి తలుస్తున్నాడని” అందరిలో (తను కలిసిన వారందరితో) చెబుతాడు. ఆ విషయాన్ని పాతాళలోకంలో తపస్సులో ఉన్న శివునికి తపోభంగం కలిగించి మరీ చెబుతుంది ‘ప్రకృతి’.
ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆవేశంతో అయితే “ఆయన్నే సృష్టి చేసుకోమని” కైలాసం వెళ్ళడానికిగానూ పాతాళలోకం నుండి పైకి వచ్చుటకొరకై చక్రాకార భ్రమణం చేయుచున్న భూమి అడ్డువచ్చుట చూసి “నేను వెళ్ళాలి దారిని వొదులు, అడ్డులే!” అని అరుస్తాడు. అప్పుడు భూమాత వినయంతో “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా, ఎవరిమీద కొపమున్నా దయచేసి నాకు నీ స్పర్శన భాగ్యం కలిగించి, నన్ను భాదింపకుండా సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేసించి, నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళవలసింది” అని దీనంగా స్తోత్ర సహితంగా ప్రార్దించింది. ఆస్తోత్రాన్ని విన్న రుద్రుడు శాంతించి అంగుష్టమాత్ర శరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చి ఆనందంతో “నీకు గల మరొక పేరు (భూమికి గల మరొక పేరు) ‘గో’, ఇది నీ కర్ణ ప్రదేశం కనుక ఇకనుండి ఈ సుందర ప్రదేశం “గోకర్ణ” గా ఖ్యాతి పొందుతుంది. ముందు యుగాలలో ఇక్కడ గోకర్ణ ఆకారంలో, “గోకర్ణేశ్వరుడనే మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా”స్థాపింపబడతాడు. అశ్వనీదేవతల పై నాకుగల ప్రేమను చాటడంకోసం ఈ పేరులో అంతర్లీనము గా ఉన్న గోకర్ణ (ఆవుచెవి – ఆవు చెవిలో అశ్వనీ దేవతలుంటారు) ఆకారం లోనే గోకర్ణేశ్వరుడు ఉంటాడు. ఈ ప్రాంతం అనేక గోవులకు ఆలవాలమై ఉంటుంది. నేను పాతాళం నుండి బయటకు వెళ్ళునప్పుడు ఈ ప్రదేశం “యోని” లాగా నాకు కనిపించినందున ఈ ప్రాంతాన్నే “రుద్రయోని / విశ్వయోని” అనీ, ప్రళయకాలంలో భూమిపై గల సముద్రుడు ఇక్కడే “సుడి” తిరిగి సృష్టిని తనలో కలిపేసుకుంటాడుగాన దీనికి “వరుణావర్తం” అనీ పేరు వస్తుంది. “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి పొద్దున్న ఉచ్ఛరించిన , గత రాత్రి చేసిన పాపములన్నీ హరించుకుపోవును. అలాగే “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి సాయంత్రం ఉచ్ఛరించిన, పొద్దున్న చేసిన పాపములన్నీ హరించుకుపోవును. ముందు ముందు క్రమంగా ఇక్కడకు మహర్షులూ, దేవతలూ, గంధర్వులూ, యోగులు వచ్చి వారి పాపముల ప్రక్షాళనగావించుకొనెదరు. ఇక్కడికి తీసుకురాబడేవారెవరైనా, ఇక్కడనుండి తీసుకుపోబడేవాడేవడైనా (ఇక్కడ మరణం పొందినవారు) అత్యంత అదృష్టవంతుడని తలంపుము. ఇక్కడే తాంత్రిక విద్యలు పుడతాయి. వాటిని నిరోధించే హనుమంతుడూ ఇక్కడే పుడతాడు. ఈ ప్రాంతం భూమి మీద గల ప్రత్యేక ప్రాంతంగా, భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక సుఖాలకు కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ముందు ముందు “అఘనాశిని మరియు గంగావళి ” (అఘనాశిని = పాపమును నశింపజేసేది, గంగావళి = గంగతో సమానమైనది) అనే పాపాలను సమూలంగా కడిగే ఈ విశ్వం లోనే గల ఏకైక సముద్ర సంగమసహిత రెండు నదులు పారుతాయి. (కాశి లోని గంగానది సముద్రసంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని మరియు గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో అప్పటివరుకు చేసిన పాపాలూ “శూన్యమవుతాయి”, ఇక్కడికి మునులూ దేవతలూ సైతం వచ్చి సంధ్యవార్చి స్నానం చేసి వెళ్ళవలసిందే!” అని రుద్రుడు భూమికి వరముని ఇచ్చి కైలాసానికేగుతాడు.

Friday 16 December 2016

అయ్యప్ప జన్మ రహాస్యమ్

నమస్కారం,


 నేను అయ్యప్ప స్వామి గురించి పూర్వం తెచ్చిన ప్రస్తావనకి అనుభంధముగా పూర్వము చెప్పిన విధంగా అయ్యప్ప స్వామి గురించి కొన్ని పరిశీలనగా చూసిన కొన్ని ప్రశ్నాత్మక సందేహాలను మీ ముందు ఉంచుతున్నాను.. 



ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు స్పందించవలసిందిగా మనవి . 


1) అయ్యప్ప స్వామి జననంకి ముఖ్య కారణం నుంచి మొదలు పెడదాము,
అయప్ప స్వామి జననానికి ముఖ్య కారణం మహిషి అనే రాక్షసి సంహారం కోసమని హరి హరులకు పుట్టిన సంతానం వలన మాత్రమే మరణం సంభవముగా బ్రహ్మ వరము పొందినది అని అన్నారు.
ఆ మహిషి ఎవరు అనేది కూడా చెప్పారు, మహిషాసురుడు అనే రాక్షసుడుకి చెల్లెలు అని, మహిషాసురుడు మరణానికి దేవతల పైన పగ తీర్చుకోవడం కోసమని తపస్సు చేసి వరము పొందినది అని అంటారు.. అసలు ఇక్కడ ఒక విషయం గమనించాలి అందరూ... మహిషాసురుడుని పార్వతీ దేవి కృత యుగములో సంహరించినది... ఆ మహిషాసురుడు కి చెల్లెలు అయిన మహిషి కూడా కృత యుగం నాటిదే, మరి ఆ మహిషిని సంహరించడానికి అయ్యప్ప కృత యుగములో కోట్ల యేళ్ళు ఆగి, త్రేతా యుగంలో కోట్ల సంవత్సరాలు ఆగి, ద్వాపర యుగంలో లక్షల సంవత్సరాలు ఆగి, కలియుగంలో 3వేల సంవత్సరాలు పైగానే ఆగి ఎందుకు అవతరించి మహిషిని సంహరించాడు?

2) కొంత మంది మహిషి ఆ యుగం నుంచే తపస్సు చేస్తూనే ఉంది అంటారు, అది సాధ్యము కానిది, ఎవరు అయినా తపస్సు ఉచ్చ స్థాయికి చేరుకునప్పుడు దేవతలు తప్పక ప్రత్యక్షం అవుతారు, లేకుంటే  వారి తపస్సు తీవ్రత వలన లోకాలు కంపిస్తాయి, అది జరుగక ముందే దేవతలు వచ్చి వరం ప్రసాదిస్తారు,. అంటే కృత యుగం నాటికే మహిషి వారం పొంది ఉండాలి & అప్పటి నుంచే ఇంద్ర పదవి ఆక్రమించి ఉండాలి... మరి ఎక్కడ? ఏ పురాణ వాగ్మయంలో కానీ సంభంధిత గ్రంధాలలో కానీ మహిషి ఇంద్ర పదవి ఆక్రమించిన ప్రస్తావన ఎందుకు ఎక్కడా లేదు? అంత ఇంద్ర పదవి ఆక్రమిస్తే మరి ఎందుకు ఎందులోనూ ప్రస్తావించలేదు?

3) అసలు మహిషి గురించే ఎక్కడా ఎందుకు లేదు? మహిషి అనే రాక్షసి గురించి కానీ తపస్సు గురించి కానీ వరం గురించి కానీ లేక ఇతర ఏ ఒక్క విషయం అయినా కానీ ఎందుకు ఏ పురాణ గ్రంధంలో ప్రస్తావించలేదు?

4) ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి చూస్తే, అంతటి హరి హర పుత్రుడు అయిన అయ్యప్ప స్వామి జననం గురించి కానీ లేక జీవితం గురించి కానీ ఎందుకు ఎక్కడా ఏ పురానా ఇతిహాసాదులలో ప్రస్తావించలేదు?  కొంత మంది అసలు చదవకా స్కాంద పురాణంలో ఉంది అంటారు, కొంత మంది వరాహ పురాణంలో ఉంది అంటారు.. నేను రెండిటిలోనూ చూశాను.. ఎక్కడా లేదు... చాలా మంది దేవతల గురించి యక్ష కిన్నెర కింపురుషాదుల గురించి చెప్పిన పురాణాలు అంతటి హరి హర పుత్రుడు ఆయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేక పోయాయి?

5) కొంత మంది అయ్యప్ప స్వామి కలియుగం వాడు అందుకనే ద్వాపర యుగములో వాడైన వేద వ్యాసుడు అయప్ప గురించి పురాణ ప్రస్తావన చేయలేకపోయాడు అనే అవకాశం ఎంత మాత్రం లేదు, ఎందుకంటే కలియుగంలో జరిగే అనేక విషయముల గురించి వ్యాసుల వారు భవిష్యత్ పురాణంలో చెప్పి ఉన్నారు,. మరి అందులో అయినా అంతటి హరి హరులకు పుట్టిన అయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేదు? పోనీ వ్యాసుల వారు చిరంజీవియే కదా, ఆది శంకరాచార్యుల వారికి దర్శనం ఇచ్చి బ్రహ్మ సూత్ర భాష్యం గూర్చి చర్చించిన ఆయన మరి అయప్ప గురించి ఎందుకు రాయలేకపోయారు ఎందుకు రాయించలేకపోయారు?

6) అసలు అయ్యప్ప స్వామి మోహినీ పుత్రుడు ఎప్పుడు అయ్యాడు? మహా విష్ణువు మోహినీ రూపము కేవలం రెండు సార్లే తీసుకున్నాడు, మొదటిది భస్మాసుర సంహారం, రెండవది క్షీర సాగర మధనం అను రెండు సంధార్భాలలో మాత్రమే తీసుకున్నాడు, అప్పుడు ఎక్కడా శివుడు మోహినిని చూసి మోహించడము కానీ అయప్ప పుట్టుక గురించి కానీ ఎక్కడా లేదే? మరి మోహినీ పుత్రుడు ఎలా అయ్యాడు?

7) అయప్ప స్వామి విగ్రహం పరశురామ ప్రతిష్టితం అన్నారు, అది కూడా సాధ్యము కానిదే, పరశురాముడు కేవలం శివ భక్తుడు, ఆయన శివుడునే పూజిస్తాడు, అంతటి పరశురాముడు ప్రతిష్ట చేస్తే కేవలం శివలింగ ప్రతిష్ట మాత్రమే చేస్తాడు, అందుకే మనము చాలా చోట్ల పరశురామ ప్రతిష్టిత శివలింగము చూస్తాము.. ఇకపోతే శివలింగ ప్రతిష్ట ఎందుకు అంటే, ఒక మనిషిని హతమార్చిన పాపం శివలింగ ప్రతిష్ట ద్వారా పోతుంది, అందుకనే పూర్వం రాజులు అనేక గుడులలో అనేక శివ లింగ ప్రతిష్టలు చేసే వారు.. పరశురాముడు అధర్మముతో ఉన్న క్షత్రియులను సంహరించడం చేత, మనిషిని చంపిన పాపం పోవడానికి శివ లింగ ప్రతిష్టలు చేశాడు,. ఆయన వేరొక దేవుడుని అసలు కొలువరు వేరొక దేవుడు విగ్రహ ప్రతిష్ట చేయరు.. అలా ఆయన అయప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట చేసినట్టుగా కూడా ఎటువంటి ప్రామాణికం లేదు..

8) అయప్ప స్వామి దీక్ష గురించి చూస్తే శనైశ్చరుడుకి వరము ఇచ్చి ఇటువంటి నియమములు పెట్టినట్టు ఉన్నది,. అది కూడా ఎక్కడా ప్రామాణికత లేదు, పైపెచ్చు.. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. శనైశ్చరుడు ఆయన ధర్మము ప్రకారము జాతక చక్రములో తాను ఉన్న కాలములో కొన్ని సార్లు చెడు ప్రభావము చూపిస్తాడు కొన్ని సార్లు మంచి చేస్తాడు,. అది ఆయన ధర్మం.. అది కూడా మన మంచి కొరకే ఆయన అలా నిర్వర్తిస్తాడు... కేవలం ఆయన జాతక చక్రంలో ఎవరికి అయితే ఆ కాలములో ఉంటాడో వారి మీద మాత్రమే శని ప్రభావము ఉంటుంది,. మరి అలాంటప్పుడు ఆ జాతక పరిస్తితి  లేని మిగతా అందరినీ కూడా అలానే శని ప్రభావము నుంచి తప్పించే విషంగా బట్టలు కట్టుకోవడం నుంచి ప్రతి నియమం పాటించమని ఎందుకు చెప్పాడు అయ్యప్ప? జాతకము గూర్చి అయప్ప స్వామికి తెలియదా? అసలు పైనవి చూస్తే అయ్యప్ప స్వామి అవతరించడమే ప్రశ్నార్ధకంగా ఉన్నది.

9) నవవిధ భక్తి రీతులలో చిట్ట చివరిది “శరణాగతి” అంటే శరణు వేడడం.. ముందు రీతులు ఏవి కానప్పుడు చిట్ట చివరిది అయిన శరణాగతిని ఆశ్రయిస్తారు.. అసలు అయప్ప స్వామిని భక్తులు ఊరక ముందే శరణం శరణం అని ఎలా అనేస్తున్నారు? ఆ “ శరణం “ అనే పదానికి ఎంత అర్ధం ఉన్నది? ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుడుని శరణు వేడుతారా? శరణాగతికి అసలు అర్ధమే మార్చేస్తున్నారే? అసలు ఎందుకు శరణు వెడుతున్నారు పదే పదే? వారి జీవితము మరియు అన్నీ వారి చేతుల్లో ఇక ఏమి లేక దిక్కు తోచక చేసే శరణాగతి స్థితిలో వారు ఎవరైనా ఉన్నారా అసలు?? వేరే ఏ దేవుడుకి ముందుగానే శరణాగతి చేయవలసిందే అనే నియమం వేరే ఏ దేవుడుకి లేనిది ఎందుకు అయ్యప్పకే ఉన్నది? అయప్ప శరణాగతి చేస్తే కానీ పలకడా? అదొక్కటే మార్గమా అయ్యప్ప విషయంలో? అసలు వారి ఉద్ధేశంలో అలా పదే పదే పలికే శరణాగతికి వివరం ఏమిటి?

10) అయ్యప్ప స్వామి పూజ గురించి చూస్తే,. అసలు ఉపనయన సంస్కారము జరగనిదే ఎవరికీ గాయత్రి మంత్రము ఉచ్చరించే స్మరించే అర్హత లేదు, సంకల్పము పలికి పూజలు చేసే అర్హత లేదు.. భగవంతుడుకే తప్పదు ఈ నియమం.. వినాయకుడు అంతటి వాడే ఉపనయనం చేసుకొనక తప్పలేదు.. మరి అయ్యప్ప స్వామి భక్తులు ఏ అర్హత పొంది అలా పూజలు చేసేస్తున్నారు? ఉపనయనము అయినదా? గాయాత్రి మంత్రోపదేశము జరిగినదా ? మరి ఎవరు పడితే వాళ్ళు పూర్తి శాస్త్ర విరుద్ధంగా అలా గాయత్రి పలుకుతూ అయప్ప పూజ ఎలా చేస్తున్నారు? ఏ మంత్రము అయినా ఉపదేశము లేనిదే చదివితే అది పెద్ద దోషము.. మరి శాస్త్ర విరుద్ధంగా అలా ఎలా ఉపదేశం లేకుండా గాయత్రి మంత్రము చదువుతూ, సంకల్పము చెప్పి ఎవరు పడితే వాళ్ళు పూజలు అలా ఎలా చేసేస్తున్నారు?


పైన అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కేవలం భావాత్మకముగా కాక సత్యములేని “మా నమ్మకం మాది” అనే మూఢ నమ్మకముతో కాక ప్రామాణీకముగా సందేహాల నివృత్తి చేయగలరని ప్రార్ధన..

ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు ప్రామాణికంగా  స్పందించవలసిందిగా మనవి .

శ్రీ రామ చంద్రపరబ్రహ్మణే నమః 🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻

 Source: internet

Tuesday 29 November 2016

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి

శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మల్లూరు


వరంగల్ కి 130 కి.మీ. ల దూరంలో అటవీ ప్రాంతంలో వున్నదీ ఆలయం. 

 ఇక్కడి విశేషాలు ఇలా? 

 అటవీ ప్రాంతంకావటంతో దోవ పొడుగూ చెట్లతో ఆకర్షణీయంగా వుంటుంది.  రోడ్డుకూడా బాగుంటుంది.   పట్టణ గజిబిజి నుంచి విశ్రాంతి కావాలనుకునేవాళ్ళు సరదాగా వెళ్ళిరావచ్చు. చిన్న కొండమీద ఆలయం .. చిన్నదైనా .. అడవిలో నెలకొన్న ఆలయం, ఆలయంలో విశేష మహత్యంకల విభిన్న స్వరూపుడైన స్వామి,  కొండకింద విశాలమైన ప్రదేశం, సకల రుగ్మతలను మాయం చేసే చింతామణి జలపాతం, ఇవ్వన్నీ ఇక్కడి విశేషాలే. ఒక్కొక్కటీ వివరిస్తాను.  ఇదంతా అటవీ ప్రాంతం.  హనుమకొండనుంచి ఏటూరునాగారం వెళ్ళే మార్గంలో వున్న మల్లూరుదాకా (మంగపేట వెళ్ళే బస్సు)  బస్సు సౌకర్యం వున్నది.  అక్కడనుంచి ఆలయానికి 4 కి.మీ.లు లోపలకెళ్ళాలి. మార్గం, ఆలయ పరిసరాలు పచ్చని చెట్లతో అందంగా వుంటాయి.  ఆటో సౌకర్యం వుంటుందిగానీ రేట్లు కొంచెం ఎక్కువన్నారు.  ఇలాంటి ప్రదేశాలకు సిటీనుంచి వెళ్ళేవాళ్ళకి సొంతవాహనమయితే సౌకర్యంగావుంటుంది.
ఇంక ఇక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి ...  ఆయన స్వయంభూ.  6 అడుగుల ఎత్తుగా, శంఖు, చక్ర, గదాయుధాలతో  నుంచున్నట్లుంటారు వక్షస్ధలంనుంచి నాభివరకు వేలితో నొక్కితే వేలు లోపలకెళ్తుంది.  వేలు తీసేస్తే ఆ ప్రాంతం మళ్లీ మామూలుగా అవుతుంది.  పూజారిగారు ఈ విశేషాన్ని చూపిస్తారు.  భక్తులను తాకనివ్వరు.  స్వామి నాభినుంచి ద్రవం స్రవిస్తూవుంటుంది.  దీనికి ఒక కధ చెప్తారు.  హిరణ్యకశిపుడి సంహారంకోసం స్వామి ఈ అరణ్యంలోకి వచ్చినట్లు, చెంచు లక్ష్మిని ఇక్కడే వివాహమాడినట్లు కాలక్రమేణా గుహాంతర్భాగాల్లో మరుగునపడ్డట్లు చెప్తారు.  తర్వాత కాలంలో భారద్వాజ, అంగీరస మహర్షులు సంచారం చేస్తూ ఈ ప్రాంతంలో ఒక రాత్రి విశ్రమించారు.  అప్పుడు స్వామి వారికి స్వప్న దర్శనమిచ్చి తనని వెలికి తీయమని ఆదేశించాడు.  వారు పలుగుతో స్వామి  చెప్పినచోట తవ్వగా స్వామి నాభి దగ్గర పలుగు తగిలి రక్తం కారిందిట.  ఋషులు వెంటనే చందనం అరగదీసి స్వామికి పరిచర్యలు చేశారుట.  ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలోనే ఇప్పడూ చీములాంటి ద్రవం స్రవిస్తూవుంటుంది.  దానిని గంధంతో కలిపి సంతానం లేనివారు సేవిస్తే సంతానం కలుగుతుందంటారు.


శని, ఆది, సోమవారాలలో స్వామికి అభిషేకం జరిగిన తర్వాత మాత్రమే ఈ ద్రవాన్ని కోరినవారికి ఇస్తారు. చిన్న గుట్టమీద వున్న ఈ ఆలయం చేరుకోవటానికి 130 మెట్లు ఎక్కాలి.  మొదట్లో స్వయంభూ ఆంజనేయస్వామిని దర్శించుకోవచ్చు.  పైన స్వామి ఆలయానికిరుపక్కలా అమ్మవార్లు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మిల ఉపాలయాలను తర్వాత నిర్మించారు.  అసలు ఆలయం 2వ శతాబ్దంనాటిదంటారు. ఇప్పుడిప్పుడే  ప్రసిధ్ధికెక్కుతున్న ఈ ఆలయం దగ్గర కోతులు ఎక్కువగా వున్నాయి.
చింతామణి జలపాతం

ఆలయం సమీపంలోనే వున్న ఈ జలపాతంలోని నీరు అద్భుత ఔషధ గుణాలుగలదనీ, దీనిని సేవిస్తే అనేక రుగ్మతలు తొలగిపోతోయనీ విశ్వసిస్తారు.  కారణం ఈ నీరు అనేక ఔషధ మొక్కలను ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది.  జలపాతం అన్నానని ఎత్తుమీదనుంచి దూకే ప్రవాహాన్ని ఊహించుకోకండి.  అత సన్నటి ధార మాత్రమే.  దీనిని అనేకమంది సీసాలలో తీసుకెళ్లి (కావాల్సినవాళ్ళు సీసాలు తమతో తీసుకెళ్ళాలి..అక్కడ దొరకవు) రోజూ ఔషధంలాగా సేవిస్తారు.

దర్శన సమయాలు

ఉదయం 10 గం. లనుంచీ సాయంత్రం 4 గం.లదాకా.  మధ్యలో 1 గంట భోజన విరామం.  అడవి ప్రాంతం కనుక వసతి, భోజనం వగైరా సౌకర్యాలు ఏమీ వుండవు.
ఇతర దర్శనీయ ప్రదేశాలు
వరంగల్ నుంచి మల్లూరు వెళ్ళే రహదారిలో సమ్మక, సారలక్కల గద్దెలున్న మేడారం (రహదారికి సుమారు 14 కి.మీ.ల దూరంలో) జాతర లేనప్పుడుకూడా చూడవచ్చు, పాలంపేటలో ప్రసిధ్ధికెక్కిన శిల్పకళానిలయం రామప్ప దేవాలయం (రహదారినుంచి 16 కి.మీ.ల దూరంలో), రామప్ప గుడినుంచి 10 కి.మీ.ల దూరంలో అతి పురాతన కోటగుళ్ళు వున్నఘనాపూర్ సందర్శనీయ స్ధలాలు.  అయితే అరణ్య ప్రాంతం కనుక ముందు మల్లూరు వెళ్ళి, వస్తూ వీలునిబట్టి మిగతా ప్రదేశాలు సందర్శించవచ్చు.

Tuesday 7 June 2016

శ్రీకామాక్షి దేవి ఆలయం కాంచీపురం

కాంచీపురంలో శ్రీకామాక్షిదేవి కొలువుదీరి ఉంది. శ్రీకామాక్షిదేవిని కామాక్షి తాయి అని కామాక్షి అమ్మణ్ణ్ పిలుస్తారు.

పూర్వం ఇక్కడ ఉండే బంగారు కామాక్షి దేవి, ఇప్పుడు తంజావూరులో కొలువుదీరి ఉన్నారు. కాంచీపురంలో భగవత్ శ్రీఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీకామాక్షిదేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది.
శ్రీకామాక్షిదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశి విశాలాక్షి శక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

"కా" అంటే "లక్ష్మి", "మా" అంటే "సరస్వతి", "అక్షి" అంటే "కన్ను". కామాక్షి దేవి అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది.
సోమస్కంద రూపంగా శివ (ఏకాంబరేశ్వర్) , ఉమ (కామాక్షి) మధ్యలో స్కంధుడు (కుమారస్వామి) కొలువుదీరి ఉన్నారు.
భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది.

ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ ఉన్న అందరికి ప్రసాదం పంచుతారు. ఆతర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు.
శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు. ఈ ఆలయంలో భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీకామాక్షి దేవి ముందు శ్రీ చక్రం ప్రతిష్టించారు.
శ్రీ కామాక్షి దేవి దివ్య మంగళ రూపం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వారహి అమ్మవారు, అరూప లక్ష్మి, రూప లక్ష్మి, వినాయకుడు, కల్వనూర్(ఆది వరాహ ఫెరుమాళ్) ను దర్శనం చేసుకోవచ్చు.
ఈ దేవాలయ ప్రాంగణంలో కుంభస్థలంపై అందంగా అలంకరించబదిన ఏనుగులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న కోనేరు చాలా విశాలంగా ఉంటుంది.

ఈ ఆలయంలో శిల్పసంపద చాలా రమణీయంగా ఉంటుంది.

ముత్తుస్వామి దీక్షితార్ ప్రవచించిన
కంజదళాయతాక్షి

కంజదళాయతాక్షి కామాక్షి
కమలా మనోహరి త్రిపుర సుందరి
కుంజర గమనే మణి మండిత మంజుళ చరణే
మామవ శివ పంజర శుకి పంకజ ముఖి
గురు గుహ రంజని దురిత భంజని నిరంజని
రాకా శశి వదనే సు రదనే
రక్షిత మదనే రత్న సదనే
శ్రీ కాంచన వసనే సు రసనే
శృంగారాశ్రయ మంద హసనే
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందామృత ఝరి భాస్వరి
ఏకాగ్ర మనో లయకరి శ్రీకరి
ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles