Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

Sunday 18 December 2016

03 వ రోజు - పాశురం

03 వ రోజు - భగవంతుని మూడో స్థానం - విభవం(అవతారములు)

 ఆండాళ్ తిరువడిగలే శరణం   

andal godadevi

పాశురము

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్

తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు

ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ

పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప

తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి

వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


విభవం(అవతారములు)

ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహమ్లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.

 "ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.

ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు! ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు.   పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు.  మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు.

మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.

వ్రత ఫలితములు


ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు.  పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక  యంత్రాలు,వాహనాలు  ఉంటే సుఖమా! లేక  సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే  సుఖమా! మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.

మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు.  మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు.  అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది,  ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.

ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా! దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.

"నాంగళ్" ఏం కోరిక లేని  "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది  "చ్చాత్తి నీర్ ఆడినాల్"  వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.

"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి  "ఊడు కయల్ ఉగళ"  ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి. "పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప"  అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్"   పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

Friday 16 December 2016

తిరుప్పావై ప్రవచనం 02 వ రోజు

తిరుప్పావై ప్రవచనం


02 వ రోజు - భగవంతుని రెండో స్థానం వ్యూహం(పాల్కడలి)
 ఆండాళ్ తిరువడిగలే శరణం

వ్రతనియమాలు
పాశురము

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు,  శాస్త్రాలలో  ఆవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి.  మరి అలాంటి మార్గంలో  పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో.  ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. "అణు:" అతి చిన్నరూపం నుండి "బృహత్:" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు.  మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!

ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం,రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం  జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని,బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో  పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు,రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి.  నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!"  ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నివ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామ చందృడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, " పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి"  పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు.   ఎందుకంటే  మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా  చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర.  మనకోసం ఇంకా ఎమి చేస్తె బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి.

వ్యుహం-పాల్కడలి


నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.

ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు.  ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.

అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.

ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు,   మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు.  అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.  ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.

 ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది-  ఇక "నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్" నెయ్యి వద్దు పాలు వద్దు. "నాట్కాలే నీరాడి" తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం.  "మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్" కాటుక,పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. "శెయ్యాదన శెయ్యోమ్" మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం " తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్" పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. "ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి" చాతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. "ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్" ఇవన్ని ఆనందంతో చేస్తాం.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

భగవద్గీత - 1

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ధృతరాష్ట్ర ఉవాచ : -


ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!


ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?


సంజయ ఉవాచ :-


దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.


ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.


పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.


ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!


అత్రశూరా మహేష్వాసాభీమార్జున సమా యుధి,యుయుధానో విరాటశ్చద్రుపదశ్చ మహారథః.
ధృష్ట కేతు శ్చేకితానఃకాశీరాజశ్చ వీర్యవాన్‌,పురుజిత్కుంతి భోజశ్చశైబ్యశ్చ నరపుజ్గవః
యుధామన్యుశ్చ విక్రాంతఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,సౌభద్రో ద్రౌపదేయాశ్చసర్వ ఏవ మహారథాః


ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.


అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.


ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ
అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.


మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు. 

ధనుర్మాసం – ప్రాధాన్యత :

ధనుర్మాసం – ప్రాధాన్యత :


ఓం నమో పరమాత్మయే నమః

ధనుస్సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక.

ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు. ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ. ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేక ప్రాధాన్యం.

అయ్యప్ప జన్మ రహాస్యమ్

నమస్కారం,


 నేను అయ్యప్ప స్వామి గురించి పూర్వం తెచ్చిన ప్రస్తావనకి అనుభంధముగా పూర్వము చెప్పిన విధంగా అయ్యప్ప స్వామి గురించి కొన్ని పరిశీలనగా చూసిన కొన్ని ప్రశ్నాత్మక సందేహాలను మీ ముందు ఉంచుతున్నాను.. 



ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు స్పందించవలసిందిగా మనవి . 


1) అయ్యప్ప స్వామి జననంకి ముఖ్య కారణం నుంచి మొదలు పెడదాము,
అయప్ప స్వామి జననానికి ముఖ్య కారణం మహిషి అనే రాక్షసి సంహారం కోసమని హరి హరులకు పుట్టిన సంతానం వలన మాత్రమే మరణం సంభవముగా బ్రహ్మ వరము పొందినది అని అన్నారు.
ఆ మహిషి ఎవరు అనేది కూడా చెప్పారు, మహిషాసురుడు అనే రాక్షసుడుకి చెల్లెలు అని, మహిషాసురుడు మరణానికి దేవతల పైన పగ తీర్చుకోవడం కోసమని తపస్సు చేసి వరము పొందినది అని అంటారు.. అసలు ఇక్కడ ఒక విషయం గమనించాలి అందరూ... మహిషాసురుడుని పార్వతీ దేవి కృత యుగములో సంహరించినది... ఆ మహిషాసురుడు కి చెల్లెలు అయిన మహిషి కూడా కృత యుగం నాటిదే, మరి ఆ మహిషిని సంహరించడానికి అయ్యప్ప కృత యుగములో కోట్ల యేళ్ళు ఆగి, త్రేతా యుగంలో కోట్ల సంవత్సరాలు ఆగి, ద్వాపర యుగంలో లక్షల సంవత్సరాలు ఆగి, కలియుగంలో 3వేల సంవత్సరాలు పైగానే ఆగి ఎందుకు అవతరించి మహిషిని సంహరించాడు?

2) కొంత మంది మహిషి ఆ యుగం నుంచే తపస్సు చేస్తూనే ఉంది అంటారు, అది సాధ్యము కానిది, ఎవరు అయినా తపస్సు ఉచ్చ స్థాయికి చేరుకునప్పుడు దేవతలు తప్పక ప్రత్యక్షం అవుతారు, లేకుంటే  వారి తపస్సు తీవ్రత వలన లోకాలు కంపిస్తాయి, అది జరుగక ముందే దేవతలు వచ్చి వరం ప్రసాదిస్తారు,. అంటే కృత యుగం నాటికే మహిషి వారం పొంది ఉండాలి & అప్పటి నుంచే ఇంద్ర పదవి ఆక్రమించి ఉండాలి... మరి ఎక్కడ? ఏ పురాణ వాగ్మయంలో కానీ సంభంధిత గ్రంధాలలో కానీ మహిషి ఇంద్ర పదవి ఆక్రమించిన ప్రస్తావన ఎందుకు ఎక్కడా లేదు? అంత ఇంద్ర పదవి ఆక్రమిస్తే మరి ఎందుకు ఎందులోనూ ప్రస్తావించలేదు?

3) అసలు మహిషి గురించే ఎక్కడా ఎందుకు లేదు? మహిషి అనే రాక్షసి గురించి కానీ తపస్సు గురించి కానీ వరం గురించి కానీ లేక ఇతర ఏ ఒక్క విషయం అయినా కానీ ఎందుకు ఏ పురాణ గ్రంధంలో ప్రస్తావించలేదు?

4) ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి చూస్తే, అంతటి హరి హర పుత్రుడు అయిన అయ్యప్ప స్వామి జననం గురించి కానీ లేక జీవితం గురించి కానీ ఎందుకు ఎక్కడా ఏ పురానా ఇతిహాసాదులలో ప్రస్తావించలేదు?  కొంత మంది అసలు చదవకా స్కాంద పురాణంలో ఉంది అంటారు, కొంత మంది వరాహ పురాణంలో ఉంది అంటారు.. నేను రెండిటిలోనూ చూశాను.. ఎక్కడా లేదు... చాలా మంది దేవతల గురించి యక్ష కిన్నెర కింపురుషాదుల గురించి చెప్పిన పురాణాలు అంతటి హరి హర పుత్రుడు ఆయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేక పోయాయి?

5) కొంత మంది అయ్యప్ప స్వామి కలియుగం వాడు అందుకనే ద్వాపర యుగములో వాడైన వేద వ్యాసుడు అయప్ప గురించి పురాణ ప్రస్తావన చేయలేకపోయాడు అనే అవకాశం ఎంత మాత్రం లేదు, ఎందుకంటే కలియుగంలో జరిగే అనేక విషయముల గురించి వ్యాసుల వారు భవిష్యత్ పురాణంలో చెప్పి ఉన్నారు,. మరి అందులో అయినా అంతటి హరి హరులకు పుట్టిన అయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేదు? పోనీ వ్యాసుల వారు చిరంజీవియే కదా, ఆది శంకరాచార్యుల వారికి దర్శనం ఇచ్చి బ్రహ్మ సూత్ర భాష్యం గూర్చి చర్చించిన ఆయన మరి అయప్ప గురించి ఎందుకు రాయలేకపోయారు ఎందుకు రాయించలేకపోయారు?

6) అసలు అయ్యప్ప స్వామి మోహినీ పుత్రుడు ఎప్పుడు అయ్యాడు? మహా విష్ణువు మోహినీ రూపము కేవలం రెండు సార్లే తీసుకున్నాడు, మొదటిది భస్మాసుర సంహారం, రెండవది క్షీర సాగర మధనం అను రెండు సంధార్భాలలో మాత్రమే తీసుకున్నాడు, అప్పుడు ఎక్కడా శివుడు మోహినిని చూసి మోహించడము కానీ అయప్ప పుట్టుక గురించి కానీ ఎక్కడా లేదే? మరి మోహినీ పుత్రుడు ఎలా అయ్యాడు?

7) అయప్ప స్వామి విగ్రహం పరశురామ ప్రతిష్టితం అన్నారు, అది కూడా సాధ్యము కానిదే, పరశురాముడు కేవలం శివ భక్తుడు, ఆయన శివుడునే పూజిస్తాడు, అంతటి పరశురాముడు ప్రతిష్ట చేస్తే కేవలం శివలింగ ప్రతిష్ట మాత్రమే చేస్తాడు, అందుకే మనము చాలా చోట్ల పరశురామ ప్రతిష్టిత శివలింగము చూస్తాము.. ఇకపోతే శివలింగ ప్రతిష్ట ఎందుకు అంటే, ఒక మనిషిని హతమార్చిన పాపం శివలింగ ప్రతిష్ట ద్వారా పోతుంది, అందుకనే పూర్వం రాజులు అనేక గుడులలో అనేక శివ లింగ ప్రతిష్టలు చేసే వారు.. పరశురాముడు అధర్మముతో ఉన్న క్షత్రియులను సంహరించడం చేత, మనిషిని చంపిన పాపం పోవడానికి శివ లింగ ప్రతిష్టలు చేశాడు,. ఆయన వేరొక దేవుడుని అసలు కొలువరు వేరొక దేవుడు విగ్రహ ప్రతిష్ట చేయరు.. అలా ఆయన అయప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట చేసినట్టుగా కూడా ఎటువంటి ప్రామాణికం లేదు..

8) అయప్ప స్వామి దీక్ష గురించి చూస్తే శనైశ్చరుడుకి వరము ఇచ్చి ఇటువంటి నియమములు పెట్టినట్టు ఉన్నది,. అది కూడా ఎక్కడా ప్రామాణికత లేదు, పైపెచ్చు.. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. శనైశ్చరుడు ఆయన ధర్మము ప్రకారము జాతక చక్రములో తాను ఉన్న కాలములో కొన్ని సార్లు చెడు ప్రభావము చూపిస్తాడు కొన్ని సార్లు మంచి చేస్తాడు,. అది ఆయన ధర్మం.. అది కూడా మన మంచి కొరకే ఆయన అలా నిర్వర్తిస్తాడు... కేవలం ఆయన జాతక చక్రంలో ఎవరికి అయితే ఆ కాలములో ఉంటాడో వారి మీద మాత్రమే శని ప్రభావము ఉంటుంది,. మరి అలాంటప్పుడు ఆ జాతక పరిస్తితి  లేని మిగతా అందరినీ కూడా అలానే శని ప్రభావము నుంచి తప్పించే విషంగా బట్టలు కట్టుకోవడం నుంచి ప్రతి నియమం పాటించమని ఎందుకు చెప్పాడు అయ్యప్ప? జాతకము గూర్చి అయప్ప స్వామికి తెలియదా? అసలు పైనవి చూస్తే అయ్యప్ప స్వామి అవతరించడమే ప్రశ్నార్ధకంగా ఉన్నది.

9) నవవిధ భక్తి రీతులలో చిట్ట చివరిది “శరణాగతి” అంటే శరణు వేడడం.. ముందు రీతులు ఏవి కానప్పుడు చిట్ట చివరిది అయిన శరణాగతిని ఆశ్రయిస్తారు.. అసలు అయప్ప స్వామిని భక్తులు ఊరక ముందే శరణం శరణం అని ఎలా అనేస్తున్నారు? ఆ “ శరణం “ అనే పదానికి ఎంత అర్ధం ఉన్నది? ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుడుని శరణు వేడుతారా? శరణాగతికి అసలు అర్ధమే మార్చేస్తున్నారే? అసలు ఎందుకు శరణు వెడుతున్నారు పదే పదే? వారి జీవితము మరియు అన్నీ వారి చేతుల్లో ఇక ఏమి లేక దిక్కు తోచక చేసే శరణాగతి స్థితిలో వారు ఎవరైనా ఉన్నారా అసలు?? వేరే ఏ దేవుడుకి ముందుగానే శరణాగతి చేయవలసిందే అనే నియమం వేరే ఏ దేవుడుకి లేనిది ఎందుకు అయ్యప్పకే ఉన్నది? అయప్ప శరణాగతి చేస్తే కానీ పలకడా? అదొక్కటే మార్గమా అయ్యప్ప విషయంలో? అసలు వారి ఉద్ధేశంలో అలా పదే పదే పలికే శరణాగతికి వివరం ఏమిటి?

10) అయ్యప్ప స్వామి పూజ గురించి చూస్తే,. అసలు ఉపనయన సంస్కారము జరగనిదే ఎవరికీ గాయత్రి మంత్రము ఉచ్చరించే స్మరించే అర్హత లేదు, సంకల్పము పలికి పూజలు చేసే అర్హత లేదు.. భగవంతుడుకే తప్పదు ఈ నియమం.. వినాయకుడు అంతటి వాడే ఉపనయనం చేసుకొనక తప్పలేదు.. మరి అయ్యప్ప స్వామి భక్తులు ఏ అర్హత పొంది అలా పూజలు చేసేస్తున్నారు? ఉపనయనము అయినదా? గాయాత్రి మంత్రోపదేశము జరిగినదా ? మరి ఎవరు పడితే వాళ్ళు పూర్తి శాస్త్ర విరుద్ధంగా అలా గాయత్రి పలుకుతూ అయప్ప పూజ ఎలా చేస్తున్నారు? ఏ మంత్రము అయినా ఉపదేశము లేనిదే చదివితే అది పెద్ద దోషము.. మరి శాస్త్ర విరుద్ధంగా అలా ఎలా ఉపదేశం లేకుండా గాయత్రి మంత్రము చదువుతూ, సంకల్పము చెప్పి ఎవరు పడితే వాళ్ళు పూజలు అలా ఎలా చేసేస్తున్నారు?


పైన అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కేవలం భావాత్మకముగా కాక సత్యములేని “మా నమ్మకం మాది” అనే మూఢ నమ్మకముతో కాక ప్రామాణీకముగా సందేహాల నివృత్తి చేయగలరని ప్రార్ధన..

ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు ప్రామాణికంగా  స్పందించవలసిందిగా మనవి .

శ్రీ రామ చంద్రపరబ్రహ్మణే నమః 🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻

 Source: internet

Tuesday 6 December 2016

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అంటే ఏమిటి?

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే (స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి.)

bharathakandam

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !
మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.
మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?
ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

Friday 2 December 2016

అయ్యప్పస్వామి దీక్ష - 18 మెట్ల విశిష్టత


భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

అవిద్య - 18వ మెట్టు

విద్య - 17వ మెట్టు

రాజసం - 16వ మెట్టు

తామసం - 15వ మెట్టు

సత్వం - 14వ మెట్టు

స్పర్శ - 13వ మెట్టు

జిహ్వ - 12వ మెట్టు

నాసిక - 11వ మెట్టు

చెవులు - 10వ మెట్టు

నేత్రములు - 9వ మెట్టు

అహంకారం - 8వ మెట్టు

దంబం - 7వ మెట్టు

మాత్స్యర్యం - 6వ మెట్టు

మదం - 5వ మెట్టు

మోహం - 4వ మెట్టు

లోభం - 3వ మెట్టు

క్రోధం - 2వ మెట్టు

కామం - 1వ మెట్టు

18 పరిపూర్ణతలను సాధించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం.

ఈ 18 మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మెట్లు పంచలోహముల (బంగారు, వెండి, రాగి, ఇనుము మరియు తగరం యొక్క ఒక ప్రత్యేక మిశ్రమం) పూతతో కప్పబడి ఉంటాయి.

41 రోజులు (మండలం) అయ్యప్ప దీక్షచేసిన వారు మాత్రమే పదునెట్టాంబడి ఎక్కుటకు అర్హులు. ఇది శబరిగిరీశుడు అయ్యప్ప నడిచిన దారి. అందుకే అత్యంత పవిత్రమైనది. ఎవరైతే పదునెట్టాంబడిని 18 సార్లు ఎక్కుతారో వాళ్ళు శబరిమలలో ఒక కొబ్బరి మొక్కని నాటుతారు.

*మొదటి 8 మెట్లు - అరిషడ్వర్గములను(6) మరియు రాగములను (2) సూచిస్తాయి* - కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దంబం, అహంకారం.

*తదుపరి 5 మెట్లు పంచేంద్రియములను సూచిస్తాయి* - నేత్రములు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శ.

*తదుపరి 3 మెట్లు మూడు గుణములను సూచిస్తాయి* - సత్వం, తామసం, రాజసం.

*చివరి 2 మెట్లు - విద్య, అవిద్యలను సూచిస్తాయి.*

- హిందూ వేదాంతం ప్రకారము '18' వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. అయ్యప్ప 18 ఆయుధాలతో చెడును నిర్మూలిస్తాడు. ఆ 18 మెట్లు 18 ఆయుధాలను సూచిస్తాయని చెబుతారు.

- భగవద్గీతలో, మహాభారతంలో, చతుర్వేదాలలో (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము) 18 అధ్యాయాలు ఉన్నాయి.

- 18 పురాణాలు, ఉపపురాణాలు కలవు. మహాభారత యుధ్ధం మరియు రావణ సంహారం 18 దినములు జరిగింది.

- కేరళలోని అయ్యప్ప సన్నిధానం 18 గొప్ప పర్వతాల మధ్యన ఉంటుంది. ఆ 18 పర్వతాలు - పొన్నంబలమేడు, గౌడెన్మల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, ఖల్గిమల, మతంగమల, మ్య్లదుంమల, శ్రీపాదమల, దేవర్మల, నిలక్కలమల, తలప్పరమల, నీలమల, కరిమల, పుదుసేర్య్మల, కలకెట్టిమల, ఇంచిప్పరమల & శబరిమల).

లోకరక్షకనే శరణమయ్యప్ప !

సద్గుణ మూర్తియే శరణమయ్యప్ప !!

పదునెట్టాంబడి అధిపతియే శరణమయ్యప్ప !!

కార్తీకమాస విశిష్టత

*కార్తీకమాస విశిష్టత*

నకార్తీక సమోమాసః- న దేవః కేశవాత్పరమ్‌
నచవేద సమం శాస్త్రం- న తీర్థం గంగాయాసమమ్‌

కార్తీక మాసం ద్వాదశ మాసాల్లో ఒకటయినా ఈ కాలంలో వచ్చే తిథుల వైశిష్ట్యం, ఉత్సవాల వైభవం.. ఇతర మాసాలకు లేని ప్రశస్తిని ఈ మాసానికి కలిగిస్తున్నాయి. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఏ దిక్కుకు తిరిగి నమస్కరించినా అది శివకేశవులకే చేరుతుంది. పంచ మహాపాతకాలను భస్మం చేసి పుణ్యకర్మలు మాత్రమే ఆచరించేలా మనసుకు మెరుగులుదిద్దే పవిత్రమాసం కార్తీకం.

కార్తీక స్నానం మహాపుణ్యప్రదం. ప్రతిరోజూ కృత్తికా నక్షత్రం అస్తమించేలోగా తెల్లవారుజామునే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.

కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివ ప్రీతికరం. చన్నీటి స్నానం ఆచరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధమై చక్కటి ఆకలి కలిగిస్తుంది.

ఈ మాసంలో పురాణ శ్రవణం, దానధర్మాచరణ వల్ల విశేష పుణ్యఫలం సిద్ధిస్తుంది.

శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది ఏక భుక్తంగా నక్త భోజనం ఒనరుస్తారు. ఇలా ఉండలేనివారు ఛాయానక్తంగా ఉంటారు. సాయం సమయంలో భోజనం చేస్తారు. మాసం మొత్తం నక్తం ఉండలేనివారు కార్తీక సోమవారం, పూర్ణిమ తిథినాడు నక్తములు ఉండవచ్చు.

సోమవారానికి చంద్రుడు అధిపతి. ఈ వారం నాడు ఉపవాసం చంద్రమౌళికి ప్రీతికరం. కార్తీక సోమవారం ఉపవాసం చేస్తూ, పంచామృతాలత రుద్రాభిషేకం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది.

ఈ మాసంలో సాయం సమయాన శివాలయంలో భక్తితో గోపుర ద్వారం వద్ద, శిఖరం మీద, శివలింగం ముందు ఆవు నేతితో దీపారాధన చేసినవారు ధన్యులవుతారు.

దీపదానం విశేష ఫలాన్నిస్తుంది. పలు జాతుల చెట్లతో ఉన్న తోటలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామం ఉంచి హరిచందన పుష్పాలతో పూజ చేసి ఆ తోటలో భుజించాలి.

కార్తీక మాసంలో కమలాక్షుడైన శ్రీహరిని కమలాలతో పూజించేవారింట కమలవాసిని అయిన శ్రీ మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. శ్రీహరిని తులసీదళాలతో, జాజి పూలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. మారేడు దళాలతో లక్ష బిల్వార్చన పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తినిస్తుంది.

తులసికోట ముందు గోమయంతో అలికి శంఖం- పద్మం- స్వస్తికం మొదలైన ముగ్గులు పెట్టిన సీ్త్ర విష్ణుప్రియ అవుతుంది.

సత్యభామ యుద్ధం -- మన దీపావళి


     యుద్ధభూమిలో గరుత్మంతుడిపై శ్రీహరి సహితంగా  నిలచిన సత్యభామ ఒక్క సారి వీరావేశం తో యుద్ధానికి పూనుకున్నది.  “ వేణిమ్ జోల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ శ్రేణిన్ దాల్చి ‘  వడి వడిగా వాలు జాడ వేసుకున్నది. చీరముడి బిగించింది. భూషణాలను సారి చేసుకున్నది. పైట బిగించింది. ముఖ చంద్రుడు కాంతు లీనుతుండగా తన కాంతుడైన శ్రీ హరి ముందు నిలిచిందట ఆ లేడి కన్నుల వన్నెలాడి. శ్రీ హరి సత్య సంరంభం చూసి  నవ్వుతూ ఇలా అన్నాడు.
“ లేమా దనుజుల గెలువగ
   లేమా నీ వేల కడగి లేచితి విటు రా
   లేమా ను మానవేనిన్
   లేమా విల్లంది కొనుము లీలన్ కేలన్ ´
    “ లేమా ! రాక్షసులను గెలువగా లేమా! నీవేందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు ఇలా రా! యుద్ధ ప్రయత్నం మాను ! మాన దలచుకోకపోతే విలాసంగా ఇదిగో ఈ విల్లు అందుకో ! “అన్నాడు శ్రీహరి నవ్వుతూ.
    హరిణాక్షి కి హరి ఇచ్చెను
    సుర నికరోల్లాసనమును శూర కఠోరా
    సుర సైన్య త్రాసనమును
    బల గర్వ నిరాసనమును బాణాసనమున్
       సత్యభామ హరినుండి విల్లు అందుకొని గొప్ప తేజస్సుని పొందింది. ధనుష్టంకారం చేసింది.
 
“ సౌవర్ణ కంకణ  ఝుణ ఝుణ నినదంబు శింజినీ రవంబు తో జెలిమి సేయ
దాటంక మణిగణ ధగ ధగ దీప్తులు గండ మండల రుచి గప్పి కొనగ
ధవళ తరాపాంగ ధళ ధళ రోచులు బాణ జాల ప్ర భాపటలి నడప
శరఘాత ఘమ ఘమ శబ్దంబు పరిపంధి సైనిక కల కల స్వనంబు నుడుప

వీర శృంగార భయ రౌద్ర విస్మయములు , కలసి భామిని యయ్యెనో కాక యనగ
నిషువు దొడగుట దివుచుట యెయు టెల్ల నెరుగ రాకుండనాని సేసె నిందు వదన “
     బంగారు కంకణాల ఝుణ ఝుణ ధ్వనులు వింటి నారి తో కలిసి పోగా , చెవి కమ్మలకు పొదిగిన  మణుల ధగ ధగ కాంతులు చెక్కిళ్ళ కాంతులపై వ్యాపింపగా , అందమైన క్రీగంటి చూపుల ధళ ధళ కాంతులు బాణాల కాంతులని కప్పివేయగా , శరము లను ప్రయోగించుట వలన కలిగిన ఘమ ఘమ శబ్దం శత్రు సైన్యాల కల కల ధ్వనులను అణిచి వేయగా సత్యభామ యుద్ధం చేస్తున్నది. వీరం శృంగారం భయం రౌద్రం విస్మయం అనే భావాలన్నీ కలిసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం లాగడం ప్రయోగించడం కూడా గుర్తించ లేనంత వేగం గా యుద్ధం చేయ సాగింది.
     ఓర కంట హరి ని చూస్తూ, శృంగారం కురిపిస్తూ, తన యుద్ధకౌశలాన్నిచూపుతున్నది మరో కంట వీర రసాన్ని కురిపిస్తున్నది. ఏక కాలం లో రెండు కురిపిస్తున్నది.
పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్, రోష రాగోదయా
విరాట భ్రూకుటి మందహాసముతో వీరంబు శృంగారమున్
జరగన్, కన్నుల కెంపు సొంపు బరగం జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలా గతిన్.
     ఏక కాలం లో రెండు రసాలను రెండు కళ్ళతో సత్యభామ ప్రదర్శిస్తున్నది. ఓరకంట నాధుడి పై మందహాస శృంగార విలాస దృక్కులతో వీక్షిస్తూ పరవశింప చేస్తున్నది. తన పరాక్రమాన్ని వయ్యారంగా హరికి చూపి హరి ని సమ్మోహితుడుని చేస్తున్నది. మరో కంట రోషముతో కెంపుల కన్నులతో వీర రసావిష్కరణం చేస్తున్నది.

మాఘమాస మహిమ -- *1వ అధ్యాయము*



శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు, గంగాదినదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.
       పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి 'స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ, అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో, ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆయాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.
             ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూతమహర్షి వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.
          సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి, పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి, వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు 'సూతమహర్షి లోగడ వైశాఖమాసం, కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని' కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళుమూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారినిగురువులను తలచుకొని నమస్కరించి కనులుతెరచి మునులకు మరల నమస్కరించి యిలాప్రారంభించాడు. మహర్షిసత్తములారా! మీరుఅడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్యప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది.చదువుకొన్నవారు కొద్దిమంది అయినా,యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపంపోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పైవిధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈవిషయం బాగా ఉపకరిస్తుంది.పూర్వం ఒకప్పుడుజగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షిమొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికిపరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటుచెప్పెదను వినండి.
          పార్వతీదేవి పరమేశ్వరునితో "విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూతదయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని" ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు "కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును? తప్పక చెప్పెదను,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగట్టును. రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా, తెలిసికాని, తెలియకకాని, బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.
           మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన కుంభీపాకనరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా, దరిద్రులైనను, బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.
          ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని, భయముచే గాని, బలవంతముగాగాని, మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.
          పార్వతీ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములుత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా.
           దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు 'మహారాజా! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నానేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.
           దిలీపమహారాజు మాఘమాసస్నానమహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైనవశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువునుదర్శించి నమస్కరించి మాఘమాసస్నానమహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపునియాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా!నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలావిశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములుయితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటేఎక్కువ పుణ్యము నిచ్చును.మాఘమాసమునప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములనుపోగట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును.స్నానమేయింత అధికమైనపుణ్యము నిచ్చునోపూజ పురాణ శ్రవణాదులవలన నెంతటిఫలముండునో యూహించుకొనుము.మాఘస్నానము వలన సర్వ దుఃఖములనుపోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరివృత్తాంతములను వివరింతును. దానిని బట్టిమాఘమాస వైశిష్ట్యమును తెలిసికొనయత్నింపుము.

           పూర్వమొకప్పుడు భయంకరమైనక్షామము(వానలు లేకపోవుట పంటలుపండకపోవుట మొదలైన లక్షణముగల కరువు)వింధ్య-హిమాలయపర్వతముల మధ్యనున్నభూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు,ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు,పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి,అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్ననుకైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చినప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొనితపమాచరించు కొనుచుండెను. పవిత్రముమనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకుగంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగుదేవజాతులవారును వచ్చుచుండిరి అచటవిహరించి ఉత్సాహమును పొందుచుండిరి.

           ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమైవిచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగమువలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు, నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.
           భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికిజాలికలిగినది వానికిసాయపడవలయుననుకొన్నాడు. నాయనాపురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలోచేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము,దురదృష్టము, పేదరికమూ ఇవి మూడునుజీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొనిశుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందుస్నానము, పవిత్రక్షేత్రములందు దేవపూజచేసినకొనవలయును.ఇట్టి వానిని పవిత్రమైనకాలమున చేసినచో సద్యఫలము కలుగును.కాలమంతయు మంచిదే అయిననుమాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసినస్నానము, పూజ, జపము, తపము జీవికి గలపాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును.అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచోవచ్చుఫలితము, మాఘమాసములో నదిలోగాని,సముద్రములోగాని, కాలువలోగాని,సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైననుఅందు స్నానము చేసినచో వచ్చును. అనగామాఘస్నానమును యేప్రవాహమున చేసిననుసర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంతగొప్పది. నీ జాతివారికైనను అనంతపుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిదిమాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటుప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలోచేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకుచెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటినదిలో మాఘస్నానమును, తీరమునయిష్టదేవతాపూజను విడువకమాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమునవాని పులిమొగము పోయి వానికి సుందరమైనముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడిమాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై,మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతనియాశీర్వాదమునంది తన భార్యలో బాటుతనలోకమున కరిగెను. దిలీపమహారాజామాఘస్నాన మహిమను గమనించితివా?మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడుమరలనిట్లు పలికెను.

Thursday 1 December 2016

మోహినీ -- భస్మాసురా కథ


భస్మాసురుడు -          మోహినీ

భాస్మాసురుడిని అంతమొందించడానికి మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు
ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి చెడు జరగాలని ఆదేశించడమే శాపం. అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి మంచి జరగాలని ఆశీర్వదించడమే వరం. శాపమిచ్చినప్పుడు శాపంగానూ, వరమిచ్చినప్పుడు వరంగానూ పనిచేయడం సహజం. కానీ ఒక్కోసారి వరాలు శాపాలుగా, శాపాలు వరాలుగా మారుతాయి. శాపం తిట్టులాంటిది. వరం దీవెన లాంటిది. చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపం, పుణ్యానికి ప్రతిఫలంగా లభించేది వరం. పాపాలు శాపాలై కాటు వేస్తే, పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి. అదేలాగో తెలుసుకోవాలంటే హిందూ పురాణాల్లోని ఒక కథను మీరు చదివి తెలుసుకోవాల్సిందే. కథేంటంటారా..వరాన్ని, శాపంగా మార్చుకొన్నబస్మాసుర కథ.. ఎలాగో కథ చదవండి... 



మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర

హిందూ పురాణాలలో భాస్మసురిని కధలో శివుడు లేదా భస్మాసురుడు, మోహిని ఉంటారు. భారతీయ పురాణాలలో దేవతలు, రాక్షసుల మధ్య శత్రుత్వం గురించి వివరించబడింది. రాక్షసులు ఎప్పుడూ సమస్యలను సృష్టించే క్రూరమైన, ప్రమాదకరమైనవారైతే, దేవతలు ప్రత్యేకంగా స్వర్గంలో ఉండేవారని భావిస్తారు.

పురాణాల ప్రకారం, అలాంటి రాక్షసులను సంహరించడం దేవతల పని. భస్మాసురుని కధ చాలా పేరుగాంచింది. భస్మాసురుడు శివుని భక్తుడు. అతను శివుడి నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు కారణంగా, మహాదేవుడు కరుణించి, ఒక వరం కోరుకొమ్మన్నాడు.

భస్మాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమన్నాడు, కానీ శివుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించే శక్తి లేదన్నాడు. అప్పుడు భస్మాసురుడు తన కోరుకున్న వరం పద్ధతిని మార్చుకున్నాడు. భాస్మసురుడి తలను తమ చూపుడు వేలుతో తాకితే, వెంటనే కాలిపోయి, బూడిద (భస్మ) అవుతాడు. అది అతని డిమాండ్. శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు.

భస్మాసురుడు చాలా సంతోషించి, అధిక సంతోషంతో, మహాదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని తనమీద తనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే, అతను తన బొటన వేలితో శివుని తలను తాకాలి అనుకున్నాడు.

వెంటనే శివుడు కాలిపోయి, బూడిదైతే పార్వతిని చేపట్టాలి అనుకున్నాడు. శివుడు ఎక్కడికి వెళితే అక్కడికి భస్మాసురుడు అనుసరించాడు. చివరికి, శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించి, ఆ పరిస్థితికి కారణమైన తనను ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిష్కారం కోరాడు.

శివుడి సమస్యను విని, మహావిష్ణు అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. విష్ణు మూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి, ముందు దయ్యంగా కనిపిస్తాడు. మోహిని ఎంత అందంగా ఉంటుందంటే, భస్మాసురుడు వెంటనే ఆమెకు ఆకర్షితుడౌతాడు.

భస్మాసురుడు, మోహినిని పెళ్ళిచేసుకోమని కోరతాడు. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం, నృత్యంలో తనకు సాటిగా ఉన్నవాళ్ళను పెళ్లిచేసుకుంటానని చెప్తుంది. భస్మాసురుడు ;అందుకు అంగీకరించి, నృత్యం ప్రారంభిస్తాడు.

భస్మాసురుడు, మోహిని అడుగులకు, అడుగులను కలిపాడు, నృత్యం చేసే సమయంలో, మోహిని తన బొటన వేలిని తన తలకు తాకే భంగిమ పెట్టింది. భస్మాసురుడు ఆమెను అనుసరించాడు, అతను తన బొటన వేలిని తన తలపై ఆంచాడు, వెంటనే అతను కాలి, బూడిదైపోయాడు, తన కోరుకున్న వరాన్ని ఈ విధంగా పొందాడు.

ఈ కధకు సంబంధించి కొద్ది తేడాలు ఉన్నాయి. కానీ కధ సారాంశంలో తేడాలేదు. "కోరుకున్న వరం భస్మాసురుడు పొందాడు" అన్న నానుడి ఈ కధ ఆధారంగా పుట్టింది. తనపన్లు తనకే ఎదురుతిరిగి, విధ్వంసకరంగా మారే లక్షణాన్ని ఇది సూచిస్తుంది.                       

                                                           🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

Sunday 27 November 2016

ఈ కార్తీకమాసం



⁠అందరివాడు అందరికన్నా ముందువాడు .

అంతరాళపు ఆణువణువూ నా నిండినవాడు .

శివ నీకు ..

కైలాసవాసికి _కర్పూరదీపాలు

వృషవాహునుడుకి _వనభోజనాలు

త్రిపురాంతకునికి _తెల్లారిస్నానాలు

సాంబశివునికి _సంధ్యాదీపాలు

అపమృత్యుహరునికి _కర్పూరదీపాలు

ఉమామహేశ్వరునికి _ఉపవాసదీక్షలు

రుద్రదేవునికి _రుద్రాభిషేకాలు

కామదహునికి _ఈ కార్తీకమాసం .    

Tuesday 7 June 2016

వాల్మీకి రామాయణం 31వ దినము

వాల్మీకి రామాయణం
31వ దినము, బాలకాండ

వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు.....
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |

మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....

అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||

మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles