Showing posts with label పూజలు. Show all posts
Showing posts with label పూజలు. Show all posts

Tuesday 17 January 2017

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి?


ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన.

ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల మెడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడు ని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర యోజన దూరం లో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.

ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ”వేదవ్యాసుడు” కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా?
ఏ ఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!

కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం ” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ”ఓం నమో భగవతే వాసుదేవాయ” ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ

Friday 13 January 2017

శివునికి అన్నంతో పూజ చేస్తే???

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.

2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.
🙏🙏🙏🙏🙏

హనుమాన్ ద్వాదశ స్తోత్రం

హనుమానంజనాసూనుర్వాయుపుత్రో మహాబలః,

రామేష్టః ఫల్గునసఖః పింగాక్షో మితవిక్రమః.

ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశనః,

లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా.

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

స్వాపకాలే పఠేన్నిత్యం,యాత్రాకాలే విశేషతః

తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్.

        🌿   ...శుభోదయం...   🌿

శివానందలహరీ

శివానందలహరీ -------
యథా బుద్ధిశ్సుక్తౌ రజత మితి కాచాశ్మని మణి,
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ట్నాసు సలిలమ్,
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో,
మహాదేవేశం, త్వాం మనసి చ న మత్వా పశుపతే !!

ఓ పశుపతీ! సర్వేశ్వరుడివైన నిన్ను మనసులో చింతించక మూడమతియగు మానవుడు ముత్యపు చిప్పను వెండిగాను, గాజుముక్కను మణిగాను, పిండి నీటిని పాలుగాను, ఎండమావుల్లో నీళ్ళను చూచి ఎలా భ్రాంతి కలిగించు కుంటాడో అలా నీకంటే పరులైన వారిని దేవుడని భ్రాంతితో సేవిస్తున్నాడు.

మహాకాళేశ్వరస్వామీ! ప్రాపంచికమైన శాశ్వతము కానివి శాశ్వతము అని భ్రమించి, మాయలో తిరుగుతూ, మిమ్మల్ని మరచి, చేసిన కర్మఫలములను అనుభవించలేక, ఎవరెవరినో ఆశ్రయించే మీ బిడ్డలమైన మాకు, కనువిప్పు కలిగించి. మాలో పశుత్వాలను పోగొట్టి పశుపతివై మమ్మల్ని రక్షించి కాపాడే సర్వేశ్వరా! ఈ ఎర్రటి మట్టి కుండల్లో తోడుపెట్టిన ఈ ఆవుపెరుగుతో మీకు అభిషేకము చేస్తున్నాను. స్వీకరించు తండ్రీ. పరమేశ్వరా! చేసేవాడిని నేనే, చేయించేవాడిని నేనే, చేయబడే వస్తువుని నేనే, అని మీరే కదా స్వామి అన్నారు. చేసేది మీరే, చేయించేది మీరే, చేసే ఆ పెరుగును నేనై నిన్ను అభిషేకించనా శివా! ఇంతకుమించి ఇంక నాకు ఏమి కావాలి. తండ్రీ! అన్నీ నీవే అయ్యి, అంతా నీవే అయ్యి, అన్నింటా నీవే ఉన్నావని మాకు తెలియజేసి, మాలో ఉన్న అజ్ఞానమనే బ్రాంతిని తొలగించి, నీవే సర్వమూ, సర్వస్వము అనే సత్యాన్ని కలిగించి మమ్మల్ని నీ సన్నిధికి చేర్చుకో శివా! మహాకాళేశ్వరస్వామీ! మీ పాదములకు నమస్కరించుచున్నాను. మా నమస్కారాన్ని స్వీకరించండి స్వామీ!

మహా కాలభైరవ స్తోత్రం

యమ్ యమ్ యమ్ యక్ష రూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం
సం సం సం సంహార మూర్తిం శిర ముకుట జటా శేఖరం చంద్ర  బింబం
డం డం  డం  దీర్ఘ  కాయం  వికృత  నఖ  ముఖం  జోర్ధ్వరోమం  కరాలం .

పం పం  పం  పాప  నాశం   ప్రనమత  సతతం  భైరవం  క్షెత్రపాలమ్
రమ్ రమ్ రమ్ రక్త వర్ణం, కటికటి తతనం తీక్ష్ణ  ధన్ స్ట్రా కరాలం!
ఘం  ఘం  ఘం  ఘోష ఘోషం ఘ ఘ  ఘ ఘ  ఘటితం  ఘర్జరం ఘోర నాదం !
కమ్ కమ్ కమ్ కాల పాశం దృక దృక ద్రుకితం జ్వాలితం కామదాహం !

తం తం తం దివ్య దేహం, ప్రనమత సతతం భైరవం క్షెత్రపాలమ్.
లం లం  లం  లం  వదంతం   ల  ల  ల  ల  లలితం  దీర్ఘ  జిహ్వాః  కరాలం !
ధుం  ధుం  ధుం  ధూమ్ర  వర్ణం  స్పుట  వికట  ముఖం  భాస్కరం  భీమరూపం,
రుం  రుం  రుం  రున్డమాలం, రవితమ నియతం  తామ్ర నేత్రం  కరాలమ్ !

నం నం  నం  నగ్నభూషం,  ప్రనమత  సతతం  భైరవం  క్షెత్రపాలమ్  !!!
వమ్ వమ్ వమ్ వాయువేగం  నటజన సదయం  బ్రహ్మ  సారం  పరంతం
ఖం  ఖం ఖం ఖడ్గ  హస్తం  త్రిభువన  విలయం  భాస్కరం  భీమ  రూపం
ఛమ్ ఛమ్ ఛమ్  చలిత్వా  చల చల  చలితా  చాలితం భూమి  చక్రం

మం మం  మం మాయి రూపం  ప్రనమత సతతం  భైరవం  క్షేత్ర  పాలం!
శం  శం  శం  శంఖ  హస్తం , శసికర ధవళం , మోక్ష సంపూర్ణ  తేజం !
మం  మం  మం  మం  మహంతం, కుల  మకుల కులం  మంత్ర గుప్తం  సునిత్యం !
యమ్ యమ్  యమ్  భూతనాధం, కిలి  కిలి  కిలితం  బాలకేలి  ప్రధానం,

అమ్ అమ్  అమ్  అంతరిక్షం, ప్రనమత సతతం  భైరవం  క్షేత్ర  పాలం!!!
ఖం  ఖం  ఖం  ఖడ్గ  భేదం, విష మమృత  మయం కాల  కాలం  కరాలం!
క్షం  క్షం  క్షం  క్షిప్ర   వేగం, దహ దహ  దహనం, తప్త  సందీప్య  మానం,
హౌం  హౌం  హౌంకార  నాదం, ప్రకటిత  గహనం  గర్జితై  భూమి  కంపం,

వమ్  వమ్  వమ్  వాల లీలం , ప్రనమత సతతం  భైరవం  క్షేత్ర  పాలం!!!
సం సం  సం  సిద్ధి  యోగం, సకల  గుణ  మఖం, దేవ దేవం ప్రసన్నం,
పం పం  పం  పద్మనాభం, హరిహర  మయనం, చంద్ర  సుర్యాగ్ని నేత్రం,
ఐమ్ ఐమ్ ఐమ్ ఐశ్వర్య  నాదం, శత  త  భయ  హారం, పూర్వదేవ  స్వరూపం,
రౌమ్ రౌమ్  రౌమ్  రౌద్ర  రూపం,  ప్రనమత సతతం  భైరవం  క్షేత్ర  పాలం!!!

హమ్ హమ్  హమ్  హంసయానం, హపితకల హకం, ముక్త యోగాట్ట  హాసం,
ధం ధం  ధం  నేత్ర  రూపం, శిర మకుట జటా భన్ధ భంధాగ్ర హస్తం!
టమ్ టమ్ టమ్ టంకార నాదం, త్రిద  సలట లటం, కామ  గర్వాప హారం,
భ్రుం  భ్రుం భ్రుం భూతనాధం, ప్రనమత సతతం  భైరవం  క్షేత్ర  పాలం!!!

శివ పూజ - మాసముల వారి పుష్పములు

1) చైత్ర మాసము నందు నృత్యము , గితములతో శివుని సేవించాలి , దర్బ పూవ్వులతో పూజ చేసిన అట్టి వారికి పలు విధములు అయిన సువర్ణములు లభించును .

2) వైశాఖ మాసము నందు శివునికి ఆవు నేయ్యి తో అభిషేకము చేయించి ,, తెల్లని వర్ణము (రంగు) కలిగిన మందార పుష్పములతో పూజ చేసిన వారికి అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలము కలుగును .

3) జేష్ట్య మాసము నందు ఎల్ల వేళల యందు శివుని ని పెరుగుతో అభిషేకించి తామర పువ్వులతో పూజ చేసిన వారికి ఉత్తమ పరమ పదములు పొందును .

4) ఆషాడ మాసము నందు బహుళ చతుర్దశి తిదియ రోజు స్నానము చేసి శుచిగా తాయారు అయ్యి కొంచు అయిన గుగ్గిలము తో ధూపము ఇంటి అంత , దేవుని మందిరములో కుడా వేసి తోదిమలతో కూడి ఉన్న పుష్పములను మాల చేసి శివునికి వేసి అర్చించిన వారు బ్రహ్మ లోకమును అధిగమించి పరమ పదము పొందుతారు .

5) శ్రావణ మాసము నందు ఒంటి పూట మాత్రమె భోజనము చేసి , గన్నేరు పూలతో శివుని ని అర్చించిన వారికి వెయ్యి గోవులను దానము చేసినటువంటి ఫలము పొందును .

6) భాద్ర పద మాసము నందు ఉత్తరేణి పువ్వులతో శివుని ని అర్చన చేసిన వారు హంస ద్వాజము తో కూడిన విమానమునండు పుణ్య పదమునకు వేల్లతారు.

7) అశ్వాయుజ మాసమున శివునికి జిల్లేడు పూలతో పూజించిన వారు మయూర ధ్వజము తో కూడిన విమానము నందు శివ పదమునకు చేరుదురు .

8) కార్తిక మాసము నందు శివుని ని క్షీరము తో (పాల ) అభి శేకము చేసి , జాజి పువ్వులతో పూజ చేసిన వారు నిరంజనమైన శివ పదమును దర్సించుదురు.

9) మార్గశిర మాసము నందు పొగడ పూలతో శివుని ని పూజించిన వారు శివుడు ఎక్కడ ఉండునో అక్కడికి చేరుతారు .

10) పుష్య మాసము నందు ఉమ్మెత్త పువ్వులతో శివునికి పూజిస్తారో అట్టివారు పరమ పదముని పొందుతారు .

11) మాఘ మాసము నందు శివునికి బిల్వదలములతో పూజిస్తారో వారు లెతయైన సూర్య - చంద్రులు గల విమానము నందు వెళ్ళెదరు .

12) ఫాల్గుణ మాసము నందు శివునికి సుగంధ జలములతో అభిషేకము చేసి తుమ్మ పువ్వులతో పూజ చేసిన వారికి ఇంద్రుని అర్ద సింహాసనము పొందుతారు .

ప్రతిదినము శివునికి ఒక జిల్లేడు పుష్పములతో శివుని ని పూజించిన వారికి పది సువర్ణ ముద్రికలను దానము చేసినంత ఫలము కలుగును.

అష్ట ఐశ్వర్యాలను సిద్దించే లలితా త్రిపుర సుందరి



త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి) రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు.

త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.

అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో

ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.

01. స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది.

బహిర్యాగంతో పూజించబడుతుంది.

02. సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.

03. పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. దంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ, ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది, పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే …

పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ!

పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో ,కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది.

దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది.

ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీచక్ర ఆరధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి.

శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.

* ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి
* జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి
* క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి

ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే

లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు.

మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు.అనేక సంవత్సరములు తపస్సు చేసాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అదగగా, మహర్షి ఆయ్నకు నమస్కరించి ‘పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు.

దానికి హయగ్రీవుడు ‘మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే’ అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు.

అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను, పరమకీరతకుదను వధించే ఘట్టంలో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా, వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది.

భండాసురుదిని వధించటం కోసమే, సమస్త లోకాలను, దేవజాతులను,ప్రకృతిని, ప్రాణకొటిని, వస్తుజాలాన్ని, మరల సృష్టించటం, సమ్రక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము, ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది.

అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆస్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు ‘కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి ‘ అనే నామం ఏర్పడింది.

అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు.

Monday 9 January 2017

తమలపాకును ఇలా చేస్తే …….. 8 ఆరోగ్య లాభాల


ప్రజలంతా సాధారణంగా తమలపాకులు కేవలం శుభకార్యాల్లో మరియు భోజనాల అనంతరం తాంబూలంగానే వాడుతూ ఉంటారు. కానీ తమలపాకులు పలు అనారోగ్యాలకు మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.
మరి తమలపాకు ద్వారా ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం .

శివ స్తుతి


శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర
గురుం,
వందే జగత్కారణం,
వందే పన్నగభూషణం మృగధరం,
వందే పశూనాం పతిం,
వందే సూర్య శశాంక వహ్ని నయనం,
వందే ముకుంద ప్రియం,
వందే భక్త జనాశ్రయం చ,
వరదం వందే శివం శంకరం.

శ్రీ సాయి సచ్చరిత --- 7 వ అధ్యాయం

శ్రీ సాయి సచ్చరిత --- 7 వ అధ్యాయం,
         20 వ ఓ వీ తరువాత :---

🌷21. రైతులు ధాన్యం కొరత ఏర్పడితే అవసరానికి వాడుకోవటానికి, ఆ సంవత్సరంలో పండిన ధాన్యాన్ని, గోధుమలను ముందుగానే పోగుచేసి సంచుల్లో కట్టి ఉంచుతారు.
🌸22. అట్లే మసీదులో బస్తాలతో నింపిపెట్టిన గోధుమలను విసురుకోవటానికి అక్కడ తిరగలి ఉండేది. చెరగటానికి చేటలు కూడా ఉండేవి. సంసారానికి అవసరమైన వాటికి ఏ కొరతా లేదు.
💐23. సభామండపంలో శోభాయమానంగా అందమైన తులసీ బృందావనం, అక్కడే లక్షణమైన ఒక చెక్క రథం ఉండేవి.
🍀24. ఏదో పుణ్యసంచితం వల్ల ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరునితో కలయిక ఏర్పడింది. ఇటువంటి సంగ్రహాన్ని హృదయ పేడికలో సేకరించి పెడితే, ఆమరణాంతం ఏ లోటూ కనిపించదు.
🌼25. ఏదో పూర్వార్జిత సౌభాగ్యం వలన బాబా పాదాల వద్ద ఆశ్రయం లభించి మనకు శాంతి, ప్రాపంచిక వ్యవహారాల్లో నిశ్చింత కలిగాయి.
🍁26. తరువాత ఎంత సుఖాన్ని సంపాదించినా ఈ సుఖం మరల రాదు. శ్రీ సాయి సమర్థుని సమాగమంలో లభించిన ఆనందాన్ని అనుభవించి నేను ధన్యుణ్ణయ్యాను.
🌺27. పరిపూర్ణ నిశ్చలత్వానికి, అత్మానందానికి నిలయం సాయి. వారి విశిష్టతను నేను ఎలా వర్ణించను ? వారి చరణాలను ఆశ్రయించిన వారు అక్కడే స్థిరపడిపోయారు.
🌻28. మృగచర్మాన్ని, దండాన్ని పట్టుకొని తిరగే తాపసులు, హరిద్వారాది తీర్థక్షేత్రాలలోని వారు, సన్యాసులు, త్యాగులు, బైరాగులు మొదలయున అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు.
🌸29. బాబా మాట్లాడుతూ, తిరుగుతూ నవ్వుతూ ఉండేవారు. వారి జిహ్వపై నిరంతరం 'అల్లా మాలిక్' అన్న నామం ఉండేది. వారికి వాదాలు, వితండ వాదాలు అయిష్టం. వారివద్ద ఎల్లప్పుడూ సటకా ఉండేది.
🌷30. వారు గొప్ప తపస్వి. మనోవికారాలను అణచి వేసి ఇంద్రియాలను నిగ్రహించినవారు. వారి వాక్కు నుండి పూర్ణ వేదాంతం స్రవిస్తుంది. చివరికి వారి అంతు ఎవరికీ చిక్కలేదు.
ఓం సాయిరామ్

సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము.

నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతన్న్నిస్తాయి. అయితే
"శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.
అది అలాగ ఉండగా, సోమవారం " సౌమ్యప్రదోషం" గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం.
సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు. ఇది ఐశ్వర్యకరం, సర్వాభీష్ఠప్రదం!
స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు. పై నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.
ప్రత్యేకించి ఈ సోమవారాలు శ్రావణ మాసంలోనూ, కార్తీకంలోను మరీ విశేషం. నభోవాస ఇందువాసరే - శ్రావణ మాస సోమవారాలలో ఈశ్వరారాధన మహైశ్వర్య ప్రదం
కార్తీక మాసం అంతా ' నక్తనియమం' గొప్పది. అలాగ కుదరనప్పుడు కనీసం సోమవారాలనాడు తప్పనిసరిగా చెయ్యాలి.
ఆ సాయంకాలార్చనలో, స్వామిని బిల్వాలతో అర్చన చెయ్యడం సంప్త్ప్రదాయకం.
ఇందువాసరే వ్రతంస్థిత్వా
నిరాహారో మహేశ్వరౌ
నక్తం హౌష్యామి......అని శాస్త్ర వచనం.
లక్ష్మి ప్రదమైనది ఇందువాసరం. (సోమవారం)
పార్వతిసహిత పరమేశ్వరున్ని ఆర్ధించాలి.
"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు
పార్వతి సహితుడైన పరమేశ్వరునుకి ఆరధన కార్తీక సోమవారాలలో విశేషం .
రామాద్యవతారాలలో శ్రి మహా విష్ణువు కూడా సదా శివుని అర్చించి, మనకు కారణ మార్గం ఉపదేశించారు.
శ్రీ రాముడు అగస్త్య మహర్షి ద్వారా " విరజా దీక్ష" ను స్వీకరించి, భస్మోద్ధుళితాం గుడై శివధ్యానంలో గడిపాడని "పద్మ పురాణం" చెప్తోంది.
అతడి దీక్షకు ఫలితముగ, సదాశివుడు పార్వతి సహితుడై సాక్షత్కరించి, దేవసభా మధ్యంలో, శ్రీ రామునకు సందర్శాననందాన్నిచ్చాడు.
శివూని సహస్ర నామాలతో సంస్తుతించి, ప్రసన్నుని చేసుకున్నాక తిరిగి, ఏకాంత దర్శనమిచ్చి రామునకు శివుడు చెప్పిన విషియాలే "శివ గీత" గా ప్రసిద్ధమయ్యాయి.
శ్రీ కృష్ణుడు కుడా ఉపమన్యు మహర్షి వలన శివ దీక్షను పొంది, శివారాధన చేసినట్లు, శివధర్మాలను అర్జున ధర్మరాజాదులకు ఉపదేశించినట్లు " మహాభారతం " చెప్తోంది.
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః
శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు.
శివుడు రామ కృష్ణాది విష్ణువు నామ జపం లో ఆనందతుడువుతుంటే, విష్ణువు శివార్చనలో ఆనందిస్తాడు. శివుడు పరమ వైష్ణవుడు. విష్ణువు పరమ శైవుడు.
కాబట్టి ఉభయుల పట్ల అభేద దృష్టితో దేవారధన సాగాలి.

Saturday 31 December 2016

శివరాత్రి మిత్రమ

శివరాత్రి మిత్రమ :-

సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర స్థ్సానాంతరాధిష్ఠితం,

సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్విసనా శోభితం

భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం

సేవే శ్రీ గిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్

Wednesday 28 December 2016

శివతాండవస్తోత్రం

Shivtandav


జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || ౧ ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨ ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || ౩ ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || ౪ ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || ౫ ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || ౬ ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || ౭ ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || ౮ ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || ౯ ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || ౧౦ ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || ౧౧ ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || ౧౨ ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || ౧౩ ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || ౧౪ ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || ౧౫ ||

Thursday 22 December 2016

బృహస్పతి కవచమ్ (గురు కవచమ్)



అస్య శ్రీబృహస్పతి కవచమహా మంత్రస్య, ఈశ్వర ఋషిః,
అనుష్టుప్ ఛందః, బృహస్పతిర్దేవతా,
గం బీజం, శ్రీం శక్తిః, క్లీం కీలకమ్,
బృహస్పతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్
అభీష్టఫలదం వందే సర్వఙ్ఞం సురపూజితమ్ |
అక్షమాలాధరం శాంతం ప్రణమామి బృహస్పతిమ్ ||

అథ బృహస్పతి కవచమ్
బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః |
కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేభీష్టదాయకః || 1 ||

జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః |
ముఖం మే పాతు సర్వఙ్ఞః కంఠం మే దేవతాగురుః || 2 ||

భుజా వంగీరసః పాతు కరౌ పాతు శుభప్రదః |
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః || 3 ||

నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః |
కటిం పాతు జగద్వంద్యః ఊరూ మే పాతు వాక్పతిః || 4 ||

జానుజంఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా |
అన్యాని యాని చాంగాని రక్షేన్మే సర్వతో గురుః || 5 ||

ఫలశృతిః
ఇత్యేతత్కవచం దివ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వాన్ కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ||

|| ఇతి శ్రీ బృహస్పతి కవచమ్ ||

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం
దీక్ష 41 రోజులే ఎందుకుచేయాలి. క్రిందచదవండి.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Ayyapa

గణపతి ప్రార్ధన


శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మయే !!

అయ్యప్ప స్వామి వారి ప్రార్ధన

అఖిల భువన దీపం భక్త చిత్తాజ్జ సూర్యం
సుర గణ ముని సేవ్యం తత్త్వ మస్యాది లక్ష్యం !
హరి హర సుత మీశం తారక బ్రహ్మ రూపం

శబరి గిరి నివాసం భావయే భూత నాదమ్ !!

|| అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్పస్వామి దీక్ష ||
మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాలని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.

"జీవానాం నరజన్మ దుర్లభం" - సకల చరాచర జీవరాశులన్నిటికన్నా మానవుడే శ్రేష్టుడు గనుక, ఋషి అంతటి వాడవ్వల్సిన మనిషి మసై, బూడిదై పోకూడదని, ఈ జన్మలోనే ముక్తిని పొంది "మానవుడు తన జన్మను చరితార్థం చేసుకోవాలనే" ఉద్దేశంతో 41 రోజులు దీక్షను ఆచరించి, ఆ దీక్షలో పొందిన ఆధ్యాత్మిక ఆనంద, అనుభవాలను మానవుడు తన జీవితకాలమంతా పొంది తద్వారా మోక్షాన్ని పొంది తరించాలన్నదే భగవంతుని ఆంతర్యం.

ఈ దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యాన్ని, శీతలోదకస్నానం(చన్నీటి స్నానం), భూతలశయనం, ఏకభుక్తం, స్వయంపాకం వంటి పలు నియమాలు పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహం కోసం 41 రోజులు దీక్ష తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళడంలో మనిషిని శారీరకంగా, మానసికంగా, దృఢంగా, క్రమశిక్షణలో ఉండేందుకు ఈ అయ్యప్ప దీక్ష ఎంతో ఉపకరిస్తుంది. శరీరంలో ఉన్న సమస్త కల్మషాలను దూరం చేసి శరీరాన్ని తేలిక పరిచే ఆరోగ్య నిధానం అయ్యప్ప దీక్షా విధానం.

భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు నియమనిష్ఠలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు జామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విబూది గంధం బొట్టు ధరిస్తారు. దినచర్యలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలను ఆచరిస్తారు.

కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ, సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకోవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను, భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత.

Wednesday 21 December 2016

చాలామందికి ఈ సందేహం వుంది



కొందరు లలితా సహస్రనామ పారాయణ ప్రతి నిత్యం చేస్తుంటారు.  కొందరు రెండు పూటలా చేస్తారు

కొందరు ప్రత్యేక దినాలలో…ఇలా రకరకాలుగా…

ఈ మధ్య లలితా సహస్రనామ పారాయణ చేసేవారి సంఖ్య ఎక్కువైందనే చెప్పొచ్చు.

వీరిలో కొందరికి మామూలుగా నిత్యం మహా నైవేద్యం పెట్టే అలవాటు వుంటుంది.

ఇలాంటివారికి ఏ సమస్యాలేదు.కొందరికి ఇంట్లో మడిగాగానీ, నిష్టగాగానీ చెయ్యటం కుదరదు.

ఒక్కొక్కళ్లకి ఒక్కో రకం ఇబ్బంది.ఇలాంటివారికి లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు అనేక అనుమానాలు.

మహా నైవేద్యం పెట్టలేక పోయామే..అసలు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి..ఏదో ఇవాళ ఒక పండు పెట్టేశాను.

సరిగ్గా చేశానో లేదో…ఇలా గుంజాటన పడతారు. అందరికీ మహా నైవేద్యం పెట్టటం అన్నివేళలా కుదరకపోవచ్చు.నిత్యం పారాయణ చేసేవారు తొందరగా అయ్యేది ఏదైనా చేసి పెట్టవచ్చు.అమ్మవారిని హరిద్రాన్నైక రసికా అని కీర్తిస్తాం.పెసర పప్పు వేసిన పులగం నైవేద్యం పెట్టవచ్చు.అదీ కుదరకపోతే కర్జూర పండు నైవేద్యం పెడితే మహా నైవేద్యం పెట్టినట్లేట.ఒక్కొక్కసారి అవి కూడా వీలు పడకపోవచ్చు..సమయానికి దొరకక, తెచ్చినవి అయిపోయి వగైరా ఏ కారణ వల్లనైనా.అప్పుడు వీలయితే ఆవుపాలలో, లేదా ఇంట్లో వుండే పాలల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టవచ్చు.అందుబాటులో వున్న ఏ పండయినా నైవేద్యం పెట్టవచ్చు.అమ్మవారికి కావలసినది భక్తికానీ ఏమి పెట్టాము అన్నది కాదు.మనం నిండు మనసుతో భక్తిగా ఏదైనా సమర్పించవచ్చు.

కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయి.చంద్ర దోష పరిహారార్ధం కొందరు పౌర్ణమినాడు చంద్రుని లలితా పరమేశ్వరి రూపంలో పూజించి, ఆరుబయట చంద్ర కిరణాలు పడే చోట పూజ చేసి పాలు, బెల్లంతో చేసిన పరవాణ్ణం నైవేద్యం పెట్టి అందరికీ పెట్టి వారు తింటారు.అలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు మినప గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెడతారు.శుక్రవారం నియమంగా పారాయణ చేసేవారు అమ్మ గుడాన్నప్రీత మానస కనుకబెల్లం వేసిన పరనాణ్ణం నైవేద్యం పెడతారు.

నిత్యపారాయణకి వీలయితే ఏమైనా చెయ్యవచ్చు.. వీలుకానప్పుడు భక్తిగా ఏది సమర్పించినా పరవాలేదు

నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?

Offerings to god


మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం ... విత్తినా మొక్కలు రావు ... వచ్చినా ధాన్యం పండదు ... పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం ... తెచ్చుకున్నా తినలేం ... ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం. ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.

ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా
ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తం మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందరు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే,  మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతిమాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు. కాని భవిష్యపురాణాది గ్రంథాల్లో చెప్పిన ప్రకారం ... కలియుగంలో బ్రాహ్మణుల్లో కంటే అబ్రాహ్మణుల్లోనే ఎక్కువమంది ఆధ్యాత్మిక మహాపురుషులు జన్మిస్తారు. కాబట్టి యుగధర్మాన్ని బట్టి అదొక లోపంగా భావించనక్కరలేదు.

ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు? అది అక్రమార్జితమా? సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.

హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీ మధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.
"శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.

భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి. హారతి ఇచ్చాకనే నైవేద్యం సమర్పించాలి.

నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి

 శ్లోకం :


శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||
విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...
శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||
ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...
ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |
అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--
ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |
అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.
నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.

దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles