Showing posts with label Quotes. Show all posts
Showing posts with label Quotes. Show all posts

Monday 30 November 2015

శృంగేరీ..సౌందర్యలహరీ!

శృంగేరీ..సౌందర్యలహరీ!


చూసే కనుదోయి అభిప్రాయాల అల్పత్వం దగ్గరే ఆగిపోకుండా, మనసును తాకి పరవశింప జేసే సౌందర్యాన్ని అణువణువునా నింపుకున్న ప్రదేశాలు అదృష్టవశాత్తూ మన దేశంలో ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వెర్రి పోకడల నవనాగరికత నీడలు పడని, కాలుష్యమింకా తెరలను పరువని నిష్కల్మష పుణ్యస్థలమైన శృంగేరి శారదా పీఠం తప్పకుండా అదే కోవకు చెందుతుంది.

జాతి వైరాన్ని మరచి ఒక పాము కప్పకు తన పడగ చాటున నీడనిచ్చిన మహత్తరమైన ప్రదేశంలో ఒక్కసారైనా కాలు మోపాలన్న ఆశా, అద్వైతాన్ని నలుదిశలా ప్రచారం చేసి, సనాతన భారతీయ ధర్మోద్ధరణ గావించిన శ్రీ శంకర భగవత్పాదులు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించిన శారదా పీఠాన్ని దర్శించుకుని ఒక రెండు రోజులు హడావుడి లోకానికి దూరంగా, ప్రశాంతంగా గడపాలన్న కోరిక - తొలుత ఈ రెండే మా అకస్మాత్తు ప్రయాణానికి ప్రేరణలు. అయితే, అనుకోని వరాల్లా, అక్కడ ఉన్న రెండు రోజుల్లోనే ముందు వినని, చదువని (చదివినా ఇంత మనోహరంగా ఉంటాయని ఊహించని) మరికొన్ని ప్రదేశాలు కూడా చూడగలిగాము.

భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి.???

భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి. వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం...
1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.
2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.
3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.
4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.
5. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.
6. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.

అరుదైన విగ్రహం అదృశ్యం.

అరుదైన విగ్రహం అదృశ్యం.
చారిత్రక సంపద తరలిపోతున్న ఎవ్వరికీ పట్టని వైనం....

812 సంవత్సరాల క్రితం హన్మకొండకు దగ్గర్లోని కొండపర్తి లో  గణపతిదేవుడని కాలంలో నిర్మించబడిన త్రికూటాలయాలం లోనిది…..
10 నెలల క్రితం  పురావస్తు శాఖ వారు ఆలయపునరుద్ధరణ పేరుతో ఆలయాన్ని  ఆలయంలోని శిల్పాలు, రాతి స్తంబాలను సమీపంలోని మరోఆలయంలో భద్రపరిచారు. అయితే అదే ఆలయం ముందున్న భారీ వినాయక విగ్రహాన్నిమాత్రం అక్కడే వదిలిపెట్టారు.ఆలయానికి ముందు ఠీవిగా కూర్చున్న అంతపెద్ద వినాయక  విగ్రహం ఇప్పుడు కనపడడం లేదు..

ధ్వజస్థంభం పుట్టుక



మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు.

షట్కర్మలు.

షట్కర్మలు.
షట్కర్మాభిరతో నిత్యం దేవతా తిథి పూజకః।
హుతశేషం తు భుంజానో బ్రాహ్మణో నావసీదతి॥
షట్కర్మలు అవశ్యకర్తవ్యాలు. అవి రెండు విధాలు.(మనుస్మ్రతి లో)

'శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం'

వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.

⚡"తం భూసుతా ముక్తిముదార హాసం

వందే యతో భవ్యభవం దయాశ్రీః|

శ్రీ యాదవం భవ్య భతోయ దేవం

సంహారదా ముక్తి ముతా సుభూతం||"

     వాసుదేవ. ఈ శ్లోకం 'శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం' లోనిది. కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 14వ శతాబ్దపు, దివిసీమ తాలూకా కవి.

సభలలో కవిత్వం సోంపు !

సభలలో కవిత్వం సోంపు !
( రఘునాథ రాయలు . వాల్మీకి చరిత్ర.)
"చెప్పఁగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై
గుప్పిన క్రియ, విరి పొట్లము
విప్పిన గతి ఘుమ్మనన్ కవిత్వము సభలన్."

ప్రమాదల నుంచి రక్షించే మహామంత్రం

ప్రమాదల నుంచి రక్షించే మహామంత్రం
.....................................................
మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.

ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.

భగవద్గిత:



 కృష్ణ పరమాత్ముడు అర్జునునికి యుద్ధ క్షేత్రం లో బోధించిన భగవద్గీత నిస్సంశయంగా ప్రతి యుగానికి, ప్రతి తరానికి అన్వయించే గ్రంధం. ఇప్పుడు చెప్తున్న వ్యక్తిత్వ వికాస పాఠాలు, అన్నిటిని నిక్షిప్తంచేసుకొన్న ఒక జ్ఞాన జలధి గీత. అందులో నుంచి ఎవరికీ వారు వారి ఓపిక కొద్ది జ్ఞానమనే ఆణిముత్యాలను వెలికి తీసుకోవచ్చు. మన భారతీయ ధర్మ గ్రంథాలలోని ఇంకో మహత్యం ఏమిటంటే, వాటిని ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లు మనకు కొత్త కొత్త భావాలు బోధ పడతాయి. అలాగే, గీత లోని భావాలు, ఈ రోజుల్లో అన్ని రంగాల వారికీ కూడా వర్తిస్తాయి, విద్యార్ధులు, పారిశ్రామిక వెథ్హలు, రాజకియ నాయకులూ, కుటుంబం, ఇలా ఒకటేమిటి అన్ని రంగాల వారికీ వర్తిస్తాయి. ఒక సారి  క్లిష్టం గా అనిపించినవి మరో సారి చదివినపుడు సులభముగా అర్థం అవుతాయి.వయసు పెరుగున్న కొద్ది వాటిని చదివినపుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Sunday 29 November 2015

యమదూతలు మోక్షము పొంది జన్మ రహిత్యమును పొందు వారెవరు?

ఒకానొకప్పుడు యమదూతలు మోక్షము పొంది జన్మ రహిత్యమును పొందు వారెవరు? మరియు, నరకార్హులై సంసారమున మగ్గు వారెవరు అని అడిగినపుడు విష్ణు దూతలు ఈ విధముగా సమాధానము ఇచ్చారట.

దుష్ట జన సాంగత్యము వీడి సాదు జనులను ఆశ్రయించు వారు, అనుక్షణము భగవత్ స్మరణతో నుండు వారు, స్నాన, సంధ్యా, జప, హోమ స్వాధ్యాయము లు ఒనరించు వారు, సర్వ భూతములను సమ భావముతో చూచువారు, నిత్యమూ అన్న దానము చేయువారు, గో, హిరణ్య, విద్య , కన్య దానము చేయువారు, పరోపకార పారిణులు, జ్ఞాన మార్గ నిష్ణాతులై, ఇతరులకు  ఉపదేశించు వారు, కపట రహితులై శ్రద్ధా భక్తులతో భగవత్ ఆరాధనా చేయువారు, నిర్ధనులకు ఉపనయన, వివాహాది సుభ కార్యములు చేయువారు, అనాధలకు సుశ్రుష చేయువారు, నిత్యమూ సాలగ్రామ తీర్ధము సేవించువారు, తులసి మాలను ధరించి, విష్ణు అర్చన చేయువారు, తులసి వనము పెంచువరు, గృహములందు నిత్యమూ దేవతారాధన, గీత పారాయణము, నామ సంకీర్తన జరుపువారు, గృహమందు, భాగవత గ్రంధమును పూజించు వారు , సూర్యుడు తుల, మకర, మేష రాశులందు ఉన్నపుడు స్నానము చేయువారు, మణికర్ణికా ఘట్టము నందు మరణించు వారు, పవిత్ర భగవన్నామ స్మరణ చేయుచు మరణించు వారు, పంచ మహా పాతకములు చేసిన వారుకూడా నామ సంకీర్తన మాత్రమున వైకుంఠమును చేరగలరు.

త్యాగ శీలురు, సత్య అహింస లనే ఆధారముగా చేసికొని సాత్వికపు వృత్తిలో జీవితము గడుపువారు, హృదయ సదనమున పరమాత్మను పూజించువారు దేవాలయములు, గోవులు, ఆశ్రమములు, బ్రాహ్మణులూ కనపడినపుడు దండ ప్రణామములు చేయువారు ముక్తిని పొందగలరు.

ముక్తికి జాతి, మత, వయో బేధములు లేవు. జన్మ పరమ్పరలను తొలగించుకొనుతయె ముక్తి పొందుట. కావున సర్వులు ముక్తిని పొందుటకు సర్వదా త్రికరణ శుద్ధిగా ప్రయత్నించ వలెను.

Thursday 26 November 2015

శతగాయత్రి-మంత్రావళి

-: బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //

-: విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

-: శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

-: వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
-: చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

-: భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
-: వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

-: శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//
-: ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//

-: దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//
-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//

-: సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

-: మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//

-: కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//

-: వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//

-: శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

-: శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

-: శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//

-: శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

-: శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//

-: శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//

-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//

-: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//

-: శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//

-: శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//

-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//

-: యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

-: మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//

-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

-: శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

-: శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//

-: భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//

-: శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

-: శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//

-: శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//

-: శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//

-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//

-: శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//

-: శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//

-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//

-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//

-: శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//

-: శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//

శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//

శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//

-: శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//

శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

సర్వే జనాః స్సుఖినోభవంతు.

Wednesday 25 November 2015

వైకుంఠ చతుర్దశి విశిష్టత


కార్తీక శుద్ధ చతుర్దశిని 'వైకుంఠ చతుర్దశి'గా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది.

ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ, ఆ తరువాత కాలంలో శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని చాలామంది గ్రహించారు. ఇక ఈ కార్తీకమాసాన్ని మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు. ఈ మాసమంతా కూడా ప్రతిరోజూ ఓ ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.

హరిహరులకు ఇది ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఈ సమయంలో వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలిక. ఈ కారణంగానే ఈ మాసంలో శ్రీమహావిష్ణువును తులసి దళాలతోను ... శివుడిని బిల్వదళాలతోను పూజిస్తుంటారు. ఇక లక్ష్మీపార్వతులు కూడా నోములు ... వ్రతాలను ఆచరించే ముత్తయిదువులను అనుగ్రహిస్తూ తీరికలేకుండా వుంటారు. అంటే ఇటు లక్ష్మీనారాయణుల ఆశీస్సులు ... అటు శివపార్వతుల అనుగ్రహాన్ని అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతోంది.

ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే 'వైకుంఠ చతుర్దశి'. సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ వుండే విష్ణుమూర్తి, ఈ రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైనరోజో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి నేరుగా కాశీ నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని అంటారు. ఇక ఈ రోజున లింగావ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది.

శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున ఇత్తడి కుందుల్లో గానీ, రాగి కుందుల్లో గాని దీపాలను వెలిగించి వాటిని దానాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి ... ఆశించే శుభాలు ఆనందంగా చేకూరతాయి.

సరస్వతీ స్తుతి పద్యాలు !

" పోతన భాగవతము " లోని సరస్వతీ స్తుతి పద్యాలు !
.(1)
"కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భరతీ "
(2)
"క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్ష దామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్"
(3)
"శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ "
(4)
"అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"

అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్పస్వామి దీక్ష

అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్పస్వామి దీక్ష ||

మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాలని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.

"జీవానాం నరజన్మ దుర్లభం" - సకల చరాచర జీవరాశులన్నిటికన్నా మానవుడే శ్రేష్టుడు గనుక, ఋషి అంతటి వాడవ్వల్సిన మనిషి మసై, బూడిదై పోకూడదని, ఈ జన్మలోనే ముక్తిని పొంది "మానవుడు తన జన్మను చరితార్థం చేసుకోవాలనే" ఉద్దేశంతో 41 రోజులు దీక్షను ఆచరించి, ఆ దీక్షలో పొందిన ఆధ్యాత్మిక ఆనంద, అనుభవాలను మానవుడు తన జీవితకాలమంతా పొంది తద్వారా మోక్షాన్ని పొంది తరించాలన్నదే భగవంతుని ఆంతర్యం.

ఈ దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యాన్ని, శీతలోదకస్నానం(చన్నీటి స్నానం), భూతలశయనం, ఏకభుక్తం, స్వయంపాకం వంటి పలు నియమాలు పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహం కోసం 41 రోజులు దీక్ష తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళడంలో మనిషిని శారీరకంగా, మానసికంగా, దృఢంగా, క్రమశిక్షణలో ఉండేందుకు ఈ అయ్యప్ప దీక్ష ఎంతో ఉపకరిస్తుంది. శరీరంలో ఉన్న సమస్త కల్మషాలను దూరం చేసి శరీరాన్ని తేలిక పరిచే ఆరోగ్య నిధానం అయ్యప్ప దీక్షా విధానం.

భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు నియమనిష్ఠలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు జామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విబూది గంధం బొట్టు ధరిస్తారు. దినచర్యలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలను ఆచరిస్తారు.

కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ , సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకోవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను, భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత...ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.

హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళా లు గుర్తున్నాయి కదా. అక్కడికి లక్షలాది మంది నాగసాదువులు రావటం మనం టీవీల్లో,పేపర్ లలో చూశాం. నాగసాదువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో,నదీ తీరాల్లో వుంటారు.మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి.
ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ,వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో ,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?
వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం .అదే నానో టెక్నాలజీ.నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం.ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే  అంతా విని  ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.

Friday 20 November 2015

'రాజంటే స్థానం కాదు, రాజంటే స్థాయి'

.
🌺
మంత్రికి
   తెలివుండాలి,
     
బంటుకి
       భక్తుండాలి...

🌺
గుర్రానికి
       వేగముండాలి

ఏనుగుకి
        బలముండాలి...

🌺
సేనాధిపతికి
     వ్యూహముండాలి,

సైనికుడికి
           తెగింపుండాలి...

🌺
యుద్ధం నెగ్గాలంటే,
   వీళ్ళందరి వెనుక
      కసి వున్న ఒక రాజుండాలి!

🌺
మనందరిలో ఒక రాజుంటాడు...

కానీ మనమే,
రాజులా ఆలోచించడం
            ఎప్పుడో ఆపేశాం!

🌺
మన కసి -
అడవులని చీల్చయినా సరే,
సముద్రాలని కోసయినా సరే,
    కొత్త దారులు కనుక్కోగలదు

         🌺 అని మనకి తెలుసు.

🌺
అయినా,
భయానికి బానిసయ్యాం.
      ఓటమికి తలొంచేసాం !

🌺
చరిత్రలో,
చాలా మంది రాజులు...

🌺ఓడిపోయారు,
    🌺 పారిపోయారు,
       🌺 ....దాక్కున్నారు,
         🌺 దాసోహమయ్యారు.

🌺
కానీ కొందరే,
అన్నీ పోగొట్టుకున్నా
కసితో మళ్ళీ తిరిగొచ్చి
             యుద్ధం చేశారు.

🌺
'రాజంటే స్థానం కాదు,
  రాజంటే స్థాయి' అని
                నిరూపించారు.

🌺
డబ్బొచ్చినా పోయినా
       వ్యక్తిత్వం కోల్పోకు...

రాజ్యాలున్నా చేజారినా
         రాజసం కోల్పోకు...

🌺
రాజంటే
కిరీటం కోట పరివారం కాదు,

     🌺 రాజంటే
               ధైర్యం...

             🌺 రాజంటే
                        ధర్మం...

                      🌺 రాజంటే
                             యుద్ధం...!

🌺
ఒకరోజు
విందుభోజనం చేస్తావు,

ఇంకోరోజు
అడుక్కుతింటావు
          - పాండవుల్లా...!

🌺
ఒక రాత్రి
బంగారు దుప్పటి
           కప్పుకుంటావు,

మరో రాత్రి
చలికి వణికిపోతావు
           - శ్రీరాముడిలా...!

🌺
ఎత్తు నుండి నేర్చుకో,
  లోతు నుండి నేర్చుకో...

రెండింటి నుండి
   ఎంతో కొంత తీసుకో...!

🌺
రాజంటే
  స్టానం కాదు

రాజంటే
         స్థాయి...

🌺
స్థానం - భౌతికం,
     కళ్ళకు కనపడుతుంది.
స్థాయి - మానసికం,
     మనసుకు తెలుస్తుంది...!

🌺
మనందరిలో
ఒక రాజుంటాడు...

బ్రతికిస్తావో,
చంపేసుకుంటావో నీ ఇష్టం!

🌺🌺🌺🌺🌺🌺🌺

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles