Showing posts with label Quotes. Show all posts
Showing posts with label Quotes. Show all posts

Thursday 19 November 2015

ఆచారం అంటే ఏమిటి?

ఆచారం అంటే ఏమిటి?
ఆచరణీయమైన దానిని ఆచారం అంటారు. బుద్ధిమంతులు, మేధావులు, పండితులు, ధర్మవేత్తలు, కుల పెద్దలు, ఆగమ కోవిదులు ఎందరెందరో ఆలోచించి, తర్కించి, మనిషిని మహోన్నతుని చేయటానికీ దురాచారం నుండి దూరం చేయటానికీ ప్రవేశపెట్టిన ఆలోచననే ఆచారం అనవచ్చు. 
త్రేతాయుగ కాలం నుండి మనుష్యుల వృత్తిని బట్టి, ప్రవృత్తిని బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా (4 వర్ణాలు ) విభజన చేయడం జరిగింది..ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కో ఆచారం ఉండేది. కాల క్రమం లో శూద్ర వర్ణం వివిధ రకాల మార్పులకు గురి అయి విభిన్న తెగలుగా, కులాలుగా విడిపోయింది. ఒక్కో తెగకు, కులానికి ఒక పెద్ద ఉండేవారు వారి వారి తెగలకు, కులాలకు వారికి ఆచరణీయమైన నియమాలు ఏర్పరచుకొన్నారు. బ్రాహ్మణ, వైశ్య,క్షత్రియ వర్ణాల వారు ఇంచు మించు గా ఒకే రకమైన నియమాలు ఏర్పరచుకున్నారు... కొన్ని ఆచారాలు మాత్రం అన్ని వర్ణాలవారికి సమానంగా ఆచరణీయం గా ఉన్నాయి. చాలా ఆచారాలు స్త్రీల కోసం కట్టుబాట్ల కోసం సృష్టింప బడ్డాయి.

పతియే ప్రత్యక్ష దైవమా! సతి ప్రత్యక్ష దేవత కాదా!


మానవ ధర్మాలను మూర్ఖం గానో, గుడ్డిగానో ప్రవేశ పెట్టలేదు; ప్రతి ధర్మం వెనుక ఒక ప్రయోజనం వుంది... ప్రతి ఆచారం వెనుక ఒక ఆలోచన ఉంది... హిందూ ధర్మం లోనే కాదు ప్రతి మతం లోను ధర్మ ప్రయోజనం వుంది.
స్త్రీలకు ఇవ్వవలసిన స్థానమేమిటో చెప్పకుండానే చెప్పింది హిందూ మతం...బ్రహ్మ దేవుడు సరస్వతి ని తన వాక్కు లో దాచుకున్నాడు; విష్ణువు లక్ష్మిని తన హృదయం లోను, శివుడు పార్వతిని తన అర్ధ శరీరం లోను దాచుకొని సముచిత స్థానం ఇచ్చారు..
భార్య కూడా దేవతా సమానురాలే!. ఏ ధర్మశాస్త్రము, భార్యను తక్కువగా చూడమని చెప్పలేదు. అన్ని విషయాలలోనూ స్త్రీలకూ ఆధిపత్యం కల్పించారు పూర్వులు. ధనానికి అధిదేవత లక్ష్మి దేవి, విద్యకు అధిదేవత సరస్వతి దేవి! శక్తి కి అధి దేవత పార్వతి దేవి; వేద శాస్త్రాలకు అధి దేవత గాయత్రీ దేవి... 

భార్య అంటే అర్ధాంగి అన్నారు పెద్దలు. అర్ధాంగి అంటే పురుషునిలో సగభాగం.మాతృ భూమి, మాతృ భాష అనటం స్త్రీని గౌరవించటమే; భర్త దేవుడైతే అర్ధాంగి దేవతే అవుతుంది.
అయితే పతియే ప్రత్యక్ష దైవం అని ఎందుకన్నారు అంటే....ఈ సృష్టి పురుష ప్రధానం గా జరిగింది.... దైహికంగా పురుషుడు బలవంతుడు కాబట్టి గృహానికి అతడే ముఖ్యస్థానం అతడే పొందాడు. ఏ రకంగా నైనా సంపాదించి స్త్రీని పోషించ వలసిన భాద్యత పురుషునికే వుంది. పిల్లల్ని కనటం పెంచటం స్త్రీల భాద్యత గా అయింది.
వేల సంవత్సరాలకు పూర్వం మానవులు గుంపులు గుంపులుగా జీవిస్తుండేవారు. స్థిర నివాసం వుండేది కాదు. అప్పటికింకా 'గ్రామాలు' పుట్టలేదు. ఒక గుంపులోని ఆడవారిని వేరొక గుంపులోని ఆడవారు ఎత్తుకు పోతుండేవారు.తమ వద్దనే శాశ్వతం గా వుంచేసుకొనే వారు. ఈ స్థితిలో పురుషులకు ఆడవారిని రక్షించుకొనే అదనపు భాద్యత వచ్చి చేరింది.... పగలు ఆహారం సంపాదించటం రాత్రిళ్ళు కాపలా కాయటం పురుషుల కర్తవ్యం గా వుండేది... ఆహరమిచ్చి రక్షించే వాడు ప్రత్యక్ష దైవమే కదా!.. ఈ విధంగా పురుషారాధన ప్రారంభమయ్యింది. భరించేవాడు భర్త కాబట్టి భర్తను దైవ సమానుడుగా గౌరవించారు భార్యలు.

షష్టిపూర్తి వేడుక ఎందుకు జరుపుకోవాలి?


గతాన్ని ఒక్కసారి వెనుదిరిగి చూసుకొని , పగలు - పంతాలు మరచి పోయి, కోపతాపాలు ప్రక్కన బెట్టి. దూరమైన బంధువుల్ని, మరచి పోయిన మిత్రుల్ని సాదరంగా పిలిచి చేసుకొనే వేడుక షష్టి పూర్తి.
అరవై సంవత్సరాల వయసంటే; ఎన్నో సంవత్సరాల దాంపత్యానుభవం... ఎంతో లోకానుభవం!.... కొడుకులు - కోడళ్లు, కూతుళ్ళు - అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, అన్నదమ్ములు, బంధువులు మిత్రులు.... ఇలా ఎందరో... వీళ్ళందరినీ ఒకసారి కలవాలి... అలా కలవాలంటే ఏదో ఒక వేడుక వేదిక గా అవ్వాలి అదే షష్టి పూర్తి వేడుక.
జీవితం లో ఎత్తు పల్లాలు, కష్ట సుఖాలు, దూషణ భూషణలు, చీత్కారాలు,... తెలిసో తెలియక మనం ఎవరినైనా నొప్పించిన వారు ఉండవచ్చు... వాళ్ళను పిలిచి క్షమాపణలు చెప్పుకోవాలి…. మన అభ్యున్నతికి కృషి చేసిన వారు ఉండవచ్చు; వీళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి.. ఇవన్నీ చెప్పడానికి అనువైన సమయం షష్టి పూర్తి వేడుక.
మనిషి కి 60 సంవత్సరాలు వచ్చిన తరువాత మిగిలేది ముందు ముందు అనుభవించే వార్ధక్యమే!. శరీరం లోని ఏ అవయవమూ సరిగా పని చేయదు. రోగాల గూడుగా మారిపోతుంది. మారిపోతున్న కాలానికి మార్చుకోలేని మనస్తత్వం తో మిగిలి పోవాల్సి వస్తుంది. షష్టి పూర్తి నాటికి మనం తీసుకోవాల్సిన ఎన్నో నిర్ణయాలు పూర్తి చేయాలి. ఇంత కాలం మనల్ని నమ్ముకొని జీవించిన అర్ధాంగికి మంచి జీవన మార్గం ఏర్పరచాలి... అక్క చెల్లెళ్ళకు, అన్న దమ్ములకు బట్టలు పెట్టాలి... అందరినీ ఆశీర్వదించాలి.. ఆశీస్సు లందాలి.... ఇదే షష్టి పూర్తి.
ఇంత చక్కని సదవకాశం మరలా జీవితం లో ఏ మనిషి కీ రాదు. అందుకే షష్టి పూర్తి అందరూ చేసుకోవాలి.
షష్టి పూర్తి వేడుక ఎవరు చేయాలి?
తమకు జన్మ ఇచ్చి, విద్యాబుద్ధులు నేర్పించి జీవితం లో స్థిర పడడానికి దోహదపడిన తల్లిదండ్రులకు పిల్లలు ఒక పెళ్లి లా చేయాలి.
షష్టి పూర్తి రోజు న ఏమి చేయాలి?
పురోహితులను సంప్రదించి సత్యన్నారాయణ వ్రతం / ఆయుష్ హోమం లాంటివి చేసుకొని పంచ భక్ష్య పరమాన్నములతో బంధు మిత్రులకు విందు భోజనం ఏర్పాటు చేయాలి. 

బ్రహ్మ ముహూర్తం (బ్రాహ్మీ ముహూర్తం) అంటే ఏమిటి?


బ్రహ్మ ముహూర్తం లో ఏ పని అయినా ప్రారంభించ వచ్చు. ఆ సమయం లో తిధి, వార, నక్షత్ర, దుర్ముహూర్త ములను పట్టించు కోవలసిన పని లేదు. ఇంటిలోకి ఒక క్రొత్త వస్తువు (టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్... ఇలాంటివి ) కొన్న తరువాత వాటిని బ్రహ్మ ముహూర్తం లో వాడడం మొదలు పెట్టవచ్చు….
ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహుర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న మూహుర్తాన్ని మంచి ముహుర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామును మంచి ముహుర్తం అంటారు. అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఏటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించవలెనని అంటారు. బ్రహ్మ మూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేకమంది నూతన గృహప్రవేశంనకు ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంనందే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
మనం ఉన్న వూరు ను బట్టి సూర్యోదయం, సూర్యాస్తమయం మారుతూ ఉంటాయి.
ఒక ఉదాహరణ చూద్దాం...
ఆగష్టు 1న సూర్యోదయం 5.28 ఉదయం.. అనుకొంటే
సూర్యోదయానికి 48 నిమిషాల ముందు వరకు అసుర ముహూర్తం; అంటే ఉదయం 4.40 నుండి 5.28 ఉదయం వరకు ఉంటుంది.
అదే రోజు బ్రహ్మ ముహూర్తం ఉదయం 3.52 నుండి ఉదయం 4.40 వరకు ఉంటుంది. 

అంతర్వాణి లేదా అంతరాత్మ ప్రబోధం అంటే ఏమిటి?


ఎంత చెడ్డవాని అంతరాత్మైనా మంచే చెబుతుంది తప్ప ఎప్పుడూ చెడు చెప్పదు....
మనం అప్పుడప్పుడు చేసే కొన్ని పొరపాటు పనులు అలా చెయ్య వద్దు అని మనలోని వాణి మనల్ని హెచ్చరిస్తూనే వుంటుంది. కాని మనం ఆ ప్రబోధాన్ని లెక్క చేయం; మన అంతరాత్మ మాట విననందుకు ఫలితం తరువాత తెలుస్తుంది.... కాని ఏమి లాభం?. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం గా.... జరగ వలసిన నష్టం జరిగిపోతుంది... అంతరాత్మ మాట విననందుకు ఫలితం ఇది...
ప్రతి ప్రాణి లోను అంతరాత్మ, అంతర్వాణి , అంతః శక్తి అనేవి వుండి తీరుతాయి. అయితే మనం మనలోని ఈ నిక్షిప్త శక్తి ని గమనించం; ఒకవేళ గమనించినా పట్టించుకోము..
మనం చాలాసార్లు చాలా విషయాల్లో మనకు తెలియకుండానే అంతర్వాణి మాటను వింటూ ఉంటాము; ఈ అంతర్వాణినే 'అంతరాత్మ' అని కూడా వ్యవహరిస్తాము... .మనం చేసే లేదా చేయబోయే మంచి / చెడ్డ పనులకు మన అంతరాత్మ స్పందిస్తూ... 'అలా చెయ్యి'..' ఇలా చేయకు' అని సలహాలిస్తూ వుంటుంది..మహా యోగులు దీనినే 'హృదయ కమలం' అని కూడా చెబుతూ వుంటారు.

భోజనం మౌనం గా చేయాలా?


ఆహారం తినే సమయంలో మాటల్లో పడితే ఎంత తింటున్నామో తెలియదు; మాటల వల్ల పోలమారడం జరిగి మనకు అసౌకర్యం కలగవచ్చు. ఎక్కువగా తిన్న ఆహారం శక్తిని కల్గించదు. టీవీ చూస్తూనో, న్యూస్ పేపర్ చదువుతూనో, కబుర్లు చెబుతూ తింటే ఆహారం రుచి తెలియదు. భోజనం చేసే సమయం లో ఏమైనా వాదులాటలు జరిగి ఇతరులతో గొడవలు పడితే భోజనానికి అర్ధాంతర ముగింపు జరగవచ్చు. ఇంటిలోని వారందరూ ఒక్కోసారి ఈ గొడవతో అర్ధాకలితో పడుకోవాల్సి రావచ్చు. 
భోజనం మౌనం గా ఎందుకు చేయాలంటే; ప్రశాంతం గా భుజించే ఆహారమే శక్తి ని కల్గించి అమృతం గా మారుతుంది; నర నరాలకూ పుష్టి నిస్తుంది. మనం రోజుకి లక్ష రూపాయలు సంపాదించినా నాలుగు ముద్దల అన్నం కోసమే కదా!. ఇంతటి ముఖ్య అవసరాన్ని ఆదుర్దాగా ముగించడం మంచిది కాదు.

దేవునికి కొబ్బరి కాయనే ఎందుకు కొట్టాలి?


బుద్ది వికాసానికి కొబ్బరి దివ్యామృతం గా పని చేస్తుంది. ఏదో విధం గా ప్రతి రోజు కొబ్బరిని తినే వారికి తెలివితేటలు, చాకచక్యము వస్తాయి. జ్ఞాపక శక్తి వేగవంతం గా ఉంటుంది. ఈ కారణం చేతనే దీని నూనె ను తలకు రాసుకుంటాము. ఈ కొబ్బరి నూనెకు నేతిలో ఉన్నంత శక్తి పదార్ధాలు వుండటం వల్లనే చలికాలం లో నేతి మాదిరి గానే పేరుకొని పోతుంది.
' గుడినిండా నీళ్ళు గుడికి తాళం' అనే పొడుపు కధకు మనకు వెంటనే స్ఫురించే సమాధానం కొబ్బరి కాయ. కొబ్బరి ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది; ఏ ఋతువు లోనైనా ఫల సాయం అందిస్తుంది. ఆహారానికీ ఔషధానికీ పనికి వచ్చే కాయ ఇది. ఆకు నుండి పీచు వరకు అన్ని భాగాలు ఉపయోగిస్తాయి.
అయితే కొబ్బరి కాయనే కొట్టాలని వేదం లో ఎక్కడా చెప్పలేదు. తదనంతర కాలం లో కొబ్బరి కాయ ఉపయోగం తెలిసిన మన ఋషులు అన్ని కాలాలలోనూ లభించే కొబ్బరి కాయ విశిష్టత గుర్తించి కొబ్బరి కాయను పూర్ణ ఫలం అని అన్నారు; దేవాలయాలలో దేవునికి సమర్పించాలి అనే నియమం ఏర్పరిచారు... కొబ్బరి కాయ సగ భాగం భక్తులకు ప్రసాదంగా పంచేవారు... (ఈ రోజుల్లో కొబ్బరి కాయ సగ భాగాన్ని వేలం పాటదారు పట్టుకొని పోతున్నాడు.... ఇది సరి అయిన పద్ధతి కాదు... )
వివాహాది శుభ కార్యక్రమాలు, శ్రీరామనవమి, వినాయకచవితి పందిళ్ళు.... ఇలా అన్ని శుభ కార్య క్రమాలలోని కొబ్బరి మట్ట, ఆకు లతో వేసే పందిళ్ళు ఎంతో శోభాయమానం గా ఉండి ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి.

సప్త వ్యసనాలు అనగా ఏమిటి? వ్యసనం వల్ల కలిగే అనర్ధం ఏమిటి?


వ్యసనం అంటే ఒక విషయం మీద మితిలేని ఆసక్తి. నియంత్రణలేని కోరిక. దానివల్ల మనిషి ఇంద్రియాలకు బానిసగా మారి, అవి నడిపినట్టు కీలుబొమ్మలా నడుస్తాడు. తనకు తానే తెలిసి తెలిసి హాని చేసుకొంటాడు. వ్యసనపరుడు అంటే తన వ్యసనానికి సంబంధించిన విషయాల్లో, మామూలు మనిషిలా వివేకమూ, బుద్ది ఉపయోగించే శక్తి కోల్పోయినవాడు. 'వ్యసనం కామక్రోధాలవల్ల కలిగే దోషం' అంటుంది మహాభారతం. ఏడు ముఖ్య వ్యసనాలను సప్త వ్యసనాలుగా గుర్తిస్తుంది. వీటిలో మద్యపానం, స్త్రీలోలత్వం, జూదం, వేట అనేవి నాలుగూ కామం వల్ల కలిగే వ్యసనాలు. వాక్పారుష్యం, దండ పారుష్యం, అర్థ దూషణం అనే మూడూ క్రోధంవల్ల కలిగే వ్యసనాలు.
కాలం ఎంత మారినా మనిషిని పీడించే కొన్ని వ్యసనాలు (మద్యపానం, స్త్రీలోలత్వం) త్రికాలాబాధితంగా, ఎల్లకాలం కొనసాగటం ఒక విచిత్రమైతే, కొన్ని వ్యసనాలు (జంతువుల వేట) కాలగతిలో వెనకబట్టడం మరో విచిత్రం. జూదం అప్పటికీ, ఇప్పటికీ కొంత రూపాంతరం చెందినట్టు కనిపిస్తుంది. ధర్మరాజు కాలంలో జూదం పాచికల ఆట. ఆ జూదమే ఇప్పుడు పేకాట (దీనికి చతుర్ముఖ పారాయణం అనే అందమైన పేరు ఎవరు పెట్టారో!) గుర్రప్పందాలూ, క్రికెట్ పందాలూ- ఇలా కొత్త కొత్త రూపాల్లో కనిపిస్తుంది. అంతర్జాలం ద్వారా జూదం ఆడే సదుపాయాలూ ఏర్పడ్డాయి. కేవలం అదృష్టం మీద ఆధారపడి, షేర్ మార్కెట్లో చిన్న పెట్టుబడితో పెద్దలాభం ఆర్జించాలని చేసే ప్రయత్నాలూ ఓ రకమైన జూదమే.

కుక్కను కొట్టకూడదా?


ఇతరులకు హాని చేయ్యనంతవరకు ఏ కుక్కనూకొట్ట కూడదు,
కుక్కను కాల భైరవ స్వామి గా భావిస్తాము. వేల సంవత్సరాల క్రితం మనిషి అరణ్యాల లో జీవించేవాడు. నదీ తీరాలలో గుంపులు గుంపులుగా గుడిసెలు వేసుకొని జీవించేవారు.. నూటికి తొంబై మంది వన్య ప్రాణులను వేటాడి జీవించేవారు. అప్పటి వారికి రెండే రెండు సమస్యలు ఉండేవి.. ఒకటి ఆహారం, రెండవది ఇతర మానవ సమూహాలనుండి రక్షణ. ఈ రెండు సమస్యలకూ పరిష్కారం చూబెట్టిన ప్రాణి పేరే 'కుక్క'. లేడి, దుప్పి, కుందేలు, అడవి కోడి, అడవి పంది వంటి వాటిని పట్టుకోవాలంటే వాటితో సమానంగా పరుగెత్తవలసి వచ్చేది... ఇటువంటి సందర్భాలలో 'కుక్క' వారికి బాగా సహకరించేది. ఆ విధంగా కుక్క మనిషి కి స్నేహ మయింది; ఆహార సంపాదనకు ఆసరా అయింది.
రెండవది రక్షణ; అరణ్యాలలో నివసించేటప్పుడు ఒక గుంపు లోని స్త్రీలను వేరొక గుంపు లోని పురుషులు రాత్రి వేళలో ఎత్తుకొని పోయేవారు. అలాగే ఆ గుంపు లోని స్త్రీలను ఈ గుంపు లోని పురుషులు.... ఒక్కోసారి సింహం, పులి వంటి క్రూర మృగాలు రాత్రి వేళలో మనుషుల మీద దాడి చేసేవి.... అటువంటి సందర్భాలలో కుక్క వారి వారి గుడిసెలకు కాపలా కాస్తూ ఎవరైనా అపరిచుతులు, క్రూర జంతువులు దాడి చేసినప్పుడు భౌ... భౌ .. మంటూ

వైష్ణవ, శైవ మతస్తులు నిలువు లేదా అడ్డు గీతలు మూడు ధరిస్తారు కదా! అర్ధం ఏమిటి?


నిలువు లేదా అడ్డు గీతలు ఎందుకు ధరిస్తారో చెప్పుకోనేముందు; మూడు గీతలు మాత్రమే ఎందుకు అంటే పరమాత్మయే సత్యమని ఒక గీత(అద్వైతం ), పరమాత్మ, జీవాత్మ ఇద్దరూ సత్యమని ఒక గీత (ద్వైతం), ఈశ్వరుడు, జీవాత్మ, ప్రకృతి;- ఈ మూడు కూడా సత్యమని(విశిష్టాద్వైతం) మూడో గీత ధరించేవారు.....
11 వ శతాభ్దం కు పూర్వం పురుషులు గంధాన్ని, స్త్రీలు కుంకుమను ధరించేవారు. 11వ శతాభ్దం లో రామానుజుడు విశిష్టాద్వైత మతాన్ని ప్రాచుర్యం లో కి తెచ్చి మూడు గీతలు ధరించడం ను ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చారు. ఎవరి మతం వారిని వారు గుర్తు ఉంచుకునేందుకు వీలుగా మూడు నిలువు గీతలు (వైష్ణవ మతం ), మూడు అడ్డు గీతలు( శైవ మతం) ఏర్పరచు కున్నారు. మూడు గీతలను అంగీకరించడమంటే, అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ఆనాడు అందరూ అంగీకరించారు అని భావన....
భారతీయ తాత్వికులు మూడు సంఖ్యను ధార్మిక సంఖ్య గా భావిస్తారు; తొమ్మిది ని బ్రహ్మ సంఖ్యగా పూజిస్తారు.పద్దెనిమిది కూడా అంతే. వైష్ణవుల నామ ధారణ గాని శైవుల విభూది ధారణ వెనుక ఉన్న అంతరార్ధం ఒకటే.... అప మృత్యు దోషాలు తొలగి పోతాయని..
ఋగ్వేదం ఏడవ మండలం లోని ఈ దిగువ మహా మృత్యుంజయ మంత్రం మననం చేస్తే.. అప మృత్యు దోషాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం..
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

ఇంటికి సున్నం ఎందుకు వేస్తారు?


మనిషికి చర్మం, ఇంటికి సున్నం వుండకపోతే కుదరవు. చర్మం రక్త మాంసాలకు కవచం గా వుంది ఎలా రక్షిస్తుందో, సున్నం కూడా గృహానికి రక్షణా కవచం లాగ వుంది రక్షిస్తుంది. గృహ నిర్మాణ రంగంలోకి సిమెంట్ రాక పూర్వం మహారాజుల మందిరాలు, దేవాలయాలు రుబ్బుడు సున్నం తో నిర్మించే వారు. తాజ్ మహల్,కుతుబ్ మీనార్, చార్మినార్, శ్రీరంగ నాధ దేవాలయం, కాశి విశ్వేశ్వరాలయం, స్వర్ణ మందిరం మొదలైన చారిత్రిక కట్టడాలన్నీ సున్నం తోనే నిర్మించారు. పూర్వ కాలం నాటి ఆన కట్టలు, వంతెనలు సున్నం తోనే కట్టినవి ఇప్పటికీ మూగ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. సున్నానికి వున్న ఆయుర్దాయం లో ఐదవ వంతు మాత్రమే సిమెంట్ కి వుంది.
ఇండ్లకి పండుగ, పర్వదినాలలో సున్నం ఎందుకు వేయాలి అంటే;
ఇటుకల ఇంటికైనా, మట్టి ఇంటి కైనా, రాతి కట్టడానికైనా బట్టీ సున్నం వేయడం ఎంతో మంచిది. శుభ ప్రదం మరియు ఆరోగ్య ప్రదం.ఇంటి లోపల బయట క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సున్నం వేసుకుంటే. వేసవి వీడిమి నుండి రక్షణ లభిస్తుంది. అలాగే శీతా కాలపు అతి చల్లదనాన్ని కూడా లోనికి రానీయదు. సున్నం వేయడం వలన గదుల లోని వెలుతురు రెట్టింపు అవుతుంది. తెల్ల సున్నం మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. అలాగే హానికారక సుక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు.సున్నం వేసిన ఇంట్లో లక్ష్మి, సరస్వతులు ఇద్దరూ వుంటారు.ఇంట్లోని వారు ప్రశాంత జీవితం గడుపుతారు. అభివృద్ది కలుగుతుంది. సున్నం వేయని ఇంట్లో గృహ ప్రవేశం చేయరాదు. ఇంట్లో పెళ్లి, ఉపనయనం వంటి శుభ కార్యక్రమాలు తలపెట్టినప్పుడు సున్నం తప్పని సరిగా వేయాలి. అలాగే ఆ ఇంట్లో మన ఆప్తుల మరణం సంభవించి సంవత్సరం పూర్తి అయినప్పుడు... సున్నం తప్పనిసరిగా వేయాలి. ప్రస్తుతం మనకు మన పూర్వీకులు వాడే సున్నం లభించుట లేదు... రక రకాల రంగులు ఎవరికి ఇష్టం వచ్చినవి వారు వేసుకుంటున్నారు.... సున్నం వేయడం లోని శాస్త్రీయతను గుర్తించడం లేదు.

రుద్రాక్షల మహిమ ఏమిటి?


రుద్రాక్షలను తెలిసి ధరించినా తెలియక ధరించినా రుద్రాక్షల మహత్యం అనుభవం లోనికి వస్తుంది. తప్పుడు మార్గాన నడిచేవారు, సత్ప్రవర్తన లేనివారు, దురాచార మనస్కులు రుద్రాక్షలు ధరిస్తే పరివర్తన చెంది సన్మార్గులు అవుతారని భారతీయుల విశ్వాసం. స్కంద పురాణం కూడా ఇదే చెబుతుంది. రుద్రాక్షలు ధరించడానికి ముహూర్తాలు చూడనవసరం లేదు. మంచి మనస్సు తో ధరించాలనుకున్నప్పుడు దరించ వచ్చు. 
పవిత్ర రుద్రాక్షలు స్త్రీ పురుషులు ఎవరైనా ధరించవచ్చు. రుద్రాక్షకు ఐదు ముఖాలు, మూడు ముఖాలు ఆరు, ఏడు ముఖాలు.... ఇలా రక రకాలుగా వుంటాయి. ఏ రుద్రాక్ష మహిమ అయినా ఒకటే... ముఖాన్ని బట్టి దాని మహిమలో అంతరాలు వుండవు.మనకు లభించే రక రకాల రుద్రాక్షలు హస్త నైపుణ్యం తో చెక్కినవే.
రుద్రాక్షలను వుంగరాలలొ ధరించకూడదు. రుద్రాక్ష మాల ధరించి సంగమించ కూడదు. బహిస్టులు ఆగిన స్త్రీలు మాత్రమె రుద్రాక్షలు ధరించాలి. ఒకరి రుద్రాక్షలు వేరొకరు ధరించరాదు.

మన తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఉండడం లోని అంతరార్ధం ఏమిటి?

మన తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఉండడం లోని అంతరార్ధం ఏమిటి?
మన తెలుగు సంవత్సరాలు ప్రభవ తో మొదలు అయి అక్షయ తో అంతమయి మరల ప్రభవ తో మొదలవుతుంది (1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.) ఈ విధంగా మొదలు అవడం వెనుక రక రకాల కధలు ప్రచారం లో వున్నాయి.... అయితే హేతు బద్ధం గా ఆలోచిస్తే....
అరవై సంవత్సరాలకొకసారి మనో ధర్మాలతో పాటుగా మానవ ధర్మాలు మార్పు చెందుతూ వుంటాయి. బుద్ది శక్తి కూడా మనకు అరవై సంవత్సరాల వరకు మాత్రమే చురుగ్గా వుంటుంది. అరవై తరువాత క్రమం గా జ్ఞాపక శక్తి క్షీణించి పోతుంది. శరీరం లోని అవయవాలు అలసట చెంది శరీరం పని మందగిస్తుంది.
అరవై సంవత్సరాల లోపల మృత్యువు ఒకసారి తన ప్రభావం చూపిస్తుందట. అంటే ఏదో రకం గా ప్రాణ గండం దగ్గరగా వచ్చి పోతుందన్నమాట!. అరవై తరువాత ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి మృత్యువు ఒకసారి పలకరించి పోతూ వుంటుంది అని చెబుతారు.
అందుకే అరవై సంవత్సరాలకు షష్టి పూర్తి చేస్తారు.
ప్రభవ 'నామ' సంవత్సరం తో ప్రారంభమై 'అక్షయ నామ' సంవత్సరం తో అరవై సంవత్సరాలు ముగిసి మరల 'ప్రభవ' ప్రారంభమై నట్లుగానే మనిషి కి 60 పూర్తి అయిన తరువాత 'బాల్యావస్థ' మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ వుంటారు... అకారణం గా అలగడం, అవీ ఇవీ తినాలని అడగడం.. చిరుతిళ్ళ కోసం చిరు దొంగతనాలు చేయడం చిన్న పిల్లల లాగ... ఎక్కువ సేపు నిదుర పోవడం, చిన్న విషయాలకే ఆనంద పడడం, కోపం తెచ్చు కోవడం.... ఈ విధం గా పిల్లలు ఎలా చేస్తారో అలాగే పెద్దలు కూడా చేస్తారు అని చెబుతుంటారు..
అరవై తరువాత తన బిడ్డకు తనే బిడ్డ అయి పోతారు తల్లి దండ్రులు.
అందుకే అరవై సంవత్సరాలు నిండిన తల్లి దండ్రులను తన బిడ్డల తో సమానం గా చూసుకోవాలని చెబుతుంది ధర్మ శాస్త్రం.
ఆరు పదుల జీవితాన్ని ఎవరైతే ఆనందం గా గడుపుతారో వారి జీవితం ధన్యమనే చెప్పా వచ్చు. ఆ ధన్య జీవితపు జ్ఞాపకార్ధమే... బిడ్డలు, మనవళ్ళు, బంధు మిత్రులు కలసి షష్టి పూర్తి ఉత్సవం గా పండగ లా చేయడం... మన తెలుగు సంవత్సారాలు అరవై వరకు మాత్రమే వుండడం లో అంతరార్ధ మిదే.
వార్ధక్యం లో స్త్రీ వ్యామోహం , అధికార దాహం వదలి వేయాలి. కుటుంబ భాద్యతను కొడుక్కి అప్పగించాలి. మంత్రి గా మాత్రమె సలహాలు ఇవ్వాలి. మనస్సు ను దైవ కార్యాల వైపు మళ్ళించాలి. తీర్ధ యాత్రలు చేయాలి. చాతనయినంతలో దాన ధర్మాలు చేయాలి. 

హిందూ పద్ధతిలో వివాహ పద్ధతులు ఎన్ని?

హిందూ పద్ధతిలో వివాహ పద్ధతులు ఎన్ని? కులాంతర మతాంతర వివాహాలలో ఏది మంచిది?
కులాంతర మతాంతర వివాహాలలో ఏదీ మంచిది కాదు... ఈ విషయం చెప్పుకొనే ముందు మన సంప్రదాయం లో వివాహ పద్ధతులు ఎన్ని విధాలు గా వున్నాయో పరిశీలిద్దాము.
బ్రాహ్మీ, దైవ,ప్రజాపత్య, రాక్షస, అసుర, కన్యాశుల్కం, గాంధర్వ, పైశాచిక మని ఎనిమిది అయినా ఆర్యధర్మం ప్రకారం వివాహాల్లో నాలుగు రకాలు ప్రాచుర్యం లో వున్నాయి.
1. బ్రాహ్మీ వివాహం, 2. గాంధర్వ వివాహం 3. క్షాత్ర వివాహం 4. రాక్షస వివాహం. .. ఈ నాలుగు వివాహాల్లో 'బ్రాహ్మీ వివాహం' విశిష్టమైనది.
1. బ్రాహ్మీ వివాహం:- ఋషి సంప్రదాయ బద్ధమైన బ్రాహ్మీ వివాహం ఆర్య సమ్మతమైన వివాహం. వధూవరుల కుల పెద్దలు, తల్లిదండ్రులు అనుమతించి అంగీకరించి ఆశీర్వదించి వైదిక విధి తో ఆచార యుక్తం గా జరిపించేది బ్రాహ్మీ వివాహం. ఇది సనాతన జన సమ్మతం ! సత్సంప్రదాయం.
2. గాంధర్వ వివాహం:- యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం లేకుండా, తమంత తాము గా పారిపోయి రహస్యం గా వేరొకచోట వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహం అంటాము. ఈ వివాహం బ్రాహ్మీ వివాహమంత గొప్పది, పవిత్రమైనది కాదు. శకుంతల దుష్యంతుని ఈ విధం గానే పెళ్ళాడి కష్టాల పాలైంది.
3. క్షాత్ర వివాహం:- కన్యామణి అంగీకారం లేకుండా కన్య తరపు వారి పెద్దల అనుమతి లేకుండా వరుడు తన శౌర్య సాహసాలను ప్రదర్శించి కన్యను బలాత్కారంగా ఎత్తుకెళ్ళి తన స్వజనుల సమక్షం లోవివాహం చేసుకోవడాన్నేక్షాత్ర వివాహం అంటారు. ఇది కేవలం క్షత్రియ కులం వారు క్షత్రియ కులం కన్యను మాత్రమే ఈ పద్ధతిలో చేసుకొనుటకు అవకాసం వుంది. ఇతర వర్ణాల వారికి ఈ అవకాశం లేదు.
4. రాక్షస వివాహం: - చతుర్విధ వివాహాల్లో ఇది నీచమైన వివాహం. ఈ వివాహానికి బ్రాహ్మణ, వైశ్య కులాల వారికి అనుమతి లేదు. ఎవరికీ తెలియకుండా, దొంగతనం గా మోసం తో, ఇష్టం లేని కన్యను అపహరించి తీసుకొనిపోయి బలవంతం గా వివాహం చేసుకోవటం రాక్షస వివాహం. శూద్ర, క్షత్రియ కులాల వారు మాత్రమే ఈ విధం గా వివాహం చేసుకోవటానికి అర్హులు.వారికి మాత్రమే ఈ రకమైన వివాహం చెల్లుబాటు అవుతుంది.
ఈ నాలుగు రకాల వివాహాలు ధర్మ సమ్మతమే అయినా పెద్దల అనుమతి తో జరిగే బ్రాహ్మీ వివాహం మాత్రమే పవిత్రమైనది.
ఇక కులాంతర, మతాంతర వివాహ విషయం పరిశీలిస్తే...
ఎవరి కులం లోని వారు వారి కులం లోని వారినే పెళ్లి చేసుకోవడం మంచిది... వారి వారి ఆచార వ్యవహారాలు ఇరువురికీ ఒకటే కాబట్టి ఇబ్బంది వుండదు....
తప్పనిసరి పరిస్థుతులలో... భగవద్గీత లో చెప్పినట్లు..
స్వధర్మేని దానం శ్రేయః పరధర్మో భయావః .... ధర్మ భ్రష్టత కన్నా కుల భ్రష్టతే మంచిది... కులాంతర వివాహం చేసుకోవచ్చు.మతాంతర వివాహం చేసుకొన్న వారికి మోక్షం లేక పిశాచాల్లా తిరుగుతూ ఉంటారని పెద్దల ఉవాచ...
అంతే కాక ఒక మతం వారి ఆచార వ్యవహారాలూ, కట్టుబాట్లు వేరొక మతం వారికి మింగుడు పడవు....
విచ్చిన్న మవుతున్న వివాహాల్లో అనేకం... మతాంతర మరియు కులాంతర వివాహాలే...

తల్లి దండ్రుల పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయా?

తల్లి దండ్రుల పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయా?
మనం ఒకోసారి వింటూ ఉంటాము... ఏ జన్మలో ఏ పాపం చేసానో... ఈ జన్మలో ఈ రోగం తో బాధ పడుతున్నాను.... ఏ జన్మలో ఏ పాపం చేసానో ఈ జన్మలో ఇలాంటి భర్త / భార్య దొరికాడు / దొరికింది.... తెలిసి నేను ఏ పాపమూ చెయ్య లేదు అయినా నా కెందుకీ శిక్ష వేసాడు దేవుడు.... 
ఇలాంటి మాటలు వింటూ ఉంటాము... మరి చెయ్యని పాపాలకు వాళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే కారణం మూడు తరములనుండి వారికి ఆనువంశికంగా వస్తున్న పాప పుణ్యాలు అని చెప్పుకోవచ్చు.
తాను గత జన్మ లో చేసిన పాప పుణ్యాలు మాత్రమే కాదు; ఈ జన్మలో తన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసిన పాప పుణ్యాలు కూడా జీవికి ఆనువంశికంగా వస్తాయి అనే చెబుతోంది ధర్మ శాస్త్రం.
కనిపించే ఆస్తి పాస్తులు; ధన - ధాన్యాలు; వస్తు - వాహనాలు ఎలాగో కనబడనివి పాప పుణ్యాలు. కనిపించే ఆస్తి పాస్తులు తర తరాలనుండి ఎలా సంక్రమిస్తున్నాయో కనబడని పాప పుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయి అని చెబుతోంది ధర్మ శాస్త్రం. వారి ఆస్తి మాకు వద్దు, వారి పాప పుణ్యాలు మాకు వద్దు అన్నంత మాత్రాన ఇవి పోవు. ఎందుకంటే ఈ శరీరమే తల్లిదండ్రులు, తాత ముత్తాతల ప్రసాదమైనప్పుదు ఈ శరీరానికి అంటిన ఆ పాపాలు అంత సులభంగా పోవు.. అలా పోవాలంటే ప్రస్తుత జన్మలో నిత్యం భగవన్నామ స్మరణ చేయాలి; ఉన్నంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయాలి. పుణ్య నదులలో స్నానాదులు చెయ్యాలి, తీర్ధ యాత్రలు చెయ్యాలి. చేసిన పాపాలకుపశ్చాత్తాపం చెందాలి. ప్రస్తుత తరం పాపాలు భవిష్యత్ తరాలకు సోకకుండా చూసుకోవాలి.

కార్తీక సోమవారం ప్రాధాన్యత ఏమిటి?

కార్తీక సోమవారం ప్రాధాన్యత ఏమిటి?
హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.
ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.దీనినే కార్తీక నత్తాలు అంటారు.
సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

కార్తీక మాసం లో వన భోజనం ఎందుకు చేయాలి?.

కార్తీక మాసం లో వన భోజనం ఎందుకు చేయాలి?.
కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడ లో (ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన) కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ప్రకృతి తో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజు గా చెప్పవచ్చు. జపాను లో కూడ హనామి (హన - పువ్వు, మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారం లో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుక చేసుకుంటారు. ఇది జపాను లో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఇది ఒకటి.
కార్తీక మాసంలో వనభోజనం తప్పని సరి. ‘వనం’ అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబు తుంది. కార్తీక మాసంలో వన భోజనానికి ఎందుకు వెళ్లాలి? దీని వెనక ఒక పరమార్థం ఉంది. అరణ్యానికి ఎవడు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. వాన ప్రస్థంలో అందరూ అరణ్యంలోనే గడుపు తారు. అరణ్యంలో ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక ఆశ్రమం కట్టుకొని, రాగద్వేషాలు లేకుండా, భగవంతుడిని ధ్యానం చేస్తూ గడుపుతారు. దానికి సాధనే వనభోజనం. అందుకే వనభోజనానికి పవిత్రమైన హృదయంతో వెళ్లాలి. ఏ ప్రకృతిలో ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఆరోగ్యాన్నిచ్చే ఉసిరి చెట్లు, తులసి చెట్లు, మామిడి చెట్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి.
ఉసిరి, తులసిల గురించి మనకు తెలుసు. మరి మామిడి విశిష్టత ఏమిటి?. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలం అని పేరు. పరమేశ్వరుని పేరు ఉన్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్లాలి. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, మరే ఏ ఇతర వ్రతం గానీ చేయాలి. విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం- ఇవన్నీ సాయంత్రం దాకా చదవాలి. పొద్దు పొడిచిన తరువాత మహా నైవేద్యం పెట్టి భోజనం చేయాలి.

ఆకాశ దీపం అంటే ఏమిటి? దేవాలయాలలో వెలిగించడం వెనుక అంతరార్ధం ఏమిటి?

ఆకాశ దీపం అంటే ఏమిటి? దేవాలయాలలో వెలిగించడం వెనుక అంతరార్ధం ఏమిటి?
శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి 'ఆకాశ దీపం' వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు.
అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ... ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం వుంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు ... ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. 'దీపావళి' రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

నక్షత్రములు రాసులు

ప్రతి నామముల ఘడియలు
1 అశ్వని (4 ) భరణి (4 ) కృతిక (1 ) -- మేషము -- మేక - 4  1 / 4 ఘడియలు
2 కృతిక (3 ) రోహిణి (4 ) మృగశిర (2 ) -- వృషభము -- ఎద్దు -- 4  3 /4  ఘడియలు
3 మృగశిర (2 ) అరుద్ర (4 ) పునర్వసు (3 )- మిధునము -- దంపతులు- 5  1 /4 ఘడియలు
4 . పునర్వసు  (1 ) పుష్యమి (4 ) ఆశ్లేష (4 )--కర్కాటకము -- పీత -- 5 1 /4  ఘడియలు
5 . మాఘ (4 ) పుబ్బ (4 ) ఉత్తర (1 )-- సింహము -- సింగము -- 5 1 /4 ఘడియలు
6 . ఉత్తర (3 ) హస్త (4 ) చిత్త (2 )-- కన్య - పడుచు - 5 ఘడియలు
7 . చిత్త (2 ) స్వాతి (4 ) విశాఖ (3 )- తుల -- త్రాసు - 5  ఘడియలు
8 . విశాఖ (1 ) అనురాధ (4 ) జ్యేష్ఠ (4 )-- వృశ్చికము -- తేలు-- 5 1 /4  ఘడియలు
9 . మూల (4 ) పూర్వాషాడా (1 )-- ధనుస్సు -- విల్లు -- 5  1 / 2  ఘడియలు
10 . ఉత్తరాషాడ (3 ) శ్రవణము (4 ) ధనిష్ఠ (2 )-- మకరము -- మొసలి -- 5 1 /4  ఘడియలు

Sunday 15 November 2015

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.

💎                  💎
ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి,
"నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా"
అని చెప్పాడు.
అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది.
శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు.
అరగంట సమయం గడిచింది.
చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది.
మరో అరగంట సమయం వేచి చూసాడు.
నీరు తేరుకున్నాయి.
ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.

అప్పుడు శిష్యుని అనుమానం
" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.
మన మనసు కూడా అంతే. ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి.
కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళీపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.
నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది.
చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
మన ప్రయత్నం లేకుందానే జరిగిపోతుంది."

మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి.
వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షాణాల గురించి ఒక్కసారి తలుచుకోండి.
ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం.
మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.

జీవితం అంటే ఒకరి కొసమ ఒకరు బ్రతకటమే.
మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి.స్నేహం,ప్రేమ ,
బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడే వారికి అర్ధం కావు.
ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.
కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.....🙏

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles